24 గంటల్లో దేశంలో 9వేల 887మందికి కొత్తగా పాజిటివ్
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో దేశంలో 9వేల 887మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 294 మంది చనిపోయారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,36,657కి చేరుకోగా, మృతుల సంఖ్య 6,642కి చేరుకుంది. 1,15,942 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,14,073 మంది కోలుకున్నారు. భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య ఇప్పుడు ప్రపంచంలో 6 వ స్థానంలో ఉంది భారతదేశంలో శుక్రవారం 9,851 కరోనావైరస్ కేసులు, 273 మరణాలు నమోదవగా.. మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు సంఖ్య 80వేల మార్కును దాటింది. మరణించిన వారి సంఖ్య 2,849గా ఉంది, ముంబైలో మాత్రమే శుక్రవారం 54 మరణాలు సంభవించాయి. రెండవ స్థానంలో తమిళనాడులో 28,694 కోవిడ్ -19 కేసులు, 232 మరణాలు సంభవించాయి. 26,334 మంది సోకినవారు మరియు 708 మంది మరణించగా.. దేశంలో మూడవ స్థానంలో ఢిల్లీ ఉంది.