Take a fresh look at your lifestyle.

అధికారుల కృషి ఫలితమే కొరోన తగ్గుముఖం

ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తుల్లో 13మంది పూర్తిగా కోలుకొని హాస్పిటల్‌ ‌నుండి డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌లతో కలసి పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 83పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయని, జిల్లా వైద్యాధికారులు, పోలీస్‌ ‌యంత్రాంగం సమన్వయంతో విధులు నిర్వహించి, పాజిటివ్‌ ‌వచ్చిన వ్యక్తుల ద్వారా ప్రైమరీ కాంటాక్ట్, ‌సెకండరీ కాంటాక్ట్ అయిన వారిని అదుపులోకి తీసుకొని వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించడం జరిగిందని తద్వారానే కరోనా వైరస్‌ ‌వ్యాప్తిని అరికట్టామని అన్నారు. ఈమేరకు జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం, వైద్యాధికారులు, పారిశుద్ద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని కంటైన్మెంట్‌ ‌ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి పాలు, పండ్లు, నిత్యావసర వస్తువులు, కూరాగాయలను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. రెడ్‌జోన్‌ ‌ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఆరోగ్య వివరాలను తెలుసుకోవడానికి అధికారులను నియమించామని, వారు ప్రతి రోజు వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. మరికొద్ది రోజులు జిల్లా ప్రజలు లాక్‌డౌన్‌ ‌నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌, ‌మల్లయ్య యాదవ్‌, ‌సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలసత్వం ఏమాత్రం పనికిరాదు
కరోనా విషయంలో అధికార యంత్రాంగం, ప్రజలు ఏ మాత్రం అలసత్వం చూపరాదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడలో ఎన్‌ఆర్‌ ‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ ‌సిబ్బందికి, పేదలకు దుస్తులను, బియ్యం, నిత్యావసర వస్తువులను ఎంపి బడుగుల లింగయ్య యాదవ్‌లతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పిలుపు మేరకు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా తగ్గుముఖం పట్టిందని, అయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు వైరస్‌ను తట్టుకునేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని, అందుకోసం ఎక్కువగా బత్తాయి, నిమ్మ పండ్లను తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి విపత్కర సమయంలో పేదలకు అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!