Take a fresh look at your lifestyle.

కొరోనారహిత భారతం…!

కడతేరిందన్న కరోనా పురుగు
పునరుత్తేజంతో విజృంభిస్తోంది

మసకబారిందన్న మహమ్మారి
మలిదశ పోరుకు సన్నద్ధమైంది

విరగడయిందన్న కోవిద్‌ ‌క్రిమి
విశృంఖలంగా విస్తరిస్తుంది

సడి చప్పుడు చేయకుండా
పెను విధ్వంసం సృష్టిస్తుంది

ప్రాణాలు అలవోకగా హరిస్తూ
రికార్డులు బద్దలుగోడుతోంది

వెక్కిరిస్తూ వికృత హాసం చేస్తూ
మనిషికి  సవాలు విసురుతోంది

అప్పుడు అచేతునులం
ఇప్పుడు ‘‘టికాస్త్రం’’ ఉంది
మన సత్తా ఏంటో తెలిసింది

అయినప్పటికీ
ప్రేక్షక పాత్ర పోషిస్తే
అలసత్వం హత్తుకుంటే
మానవ వినాశనం తప్పదు

అందుకే
కరోనా అంతం లక్ష్యంగా..
మరో పోరుకు సన్నద్ధమవాలి

వ్యాక్సినేషన్‌ ‌యజ్ఞంలో …
బాగస్వాములం కావాలి

ఆరోగ్య సూత్రాలు ఆచరిస్తూ …
నియమ నిబంధనలు పాటిస్తూ ..
..శత్రువును ధీటుగా ఎదురిస్తూ
జీవన ప్రస్తానం సాఫీగా సాగించాలి
కొరోనారహిత భారతం ప్రతిష్టించాలి

(కరోనా మలి విజృంభనపై అక్షరాస్త్రం సందిస్తూ….)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply