Take a fresh look at your lifestyle.

ఏపీలో పెరుగుతున్న కొరోనా కేసులు

  • కొత్తగా 38 పాజిటివ్‌ ‌కేసులు నమోదు
  • శ్రీకాకుళం జిల్లాలో కనిపించని కొరోనా పాజిటివ్‌
  • ‌కొరోనా పాజిటివ్‌ల సంఖ్య 572కి చేరిక

అమరావతి,ఏప్రిల్‌ 17 : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా శుక్రవారం 38 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 572కి చేరుకుంది. వీరిలో 35 మంది డిశ్చార్జ్ ‌కాగా.. 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం 523 మంది చికిత్స పొందుతున్నారు.కర్నూలు జిల్లాలో అత్యధికంగా 13 కేసులు నమోదవగా.. నెల్లూరులో 6, అనంతపురం, చిత్తూరు జిల్లాలో 5 చొప్పున, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4 చొప్పున, కడపలో ఒక కేసు నమోదైంది. అయితే కడప జిల్లా నుంచి 13 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని నిన్న డిశ్చార్జ్ అయ్యారు. అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే కరోనా వైరస్‌కు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాకపోవడం సంతోషకరమే. అయితే.. ఎక్కడైనా ఇంతవరకు గుర్తించని పరిస్థితులు ఉన్నాయా? అనే కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అటువంటి కేసులను గుర్తించేందుకు జిల్లా అంతటాజల్లెడ పట్టాల్సిందేనని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించింది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎవరైనా…ఏవైనా అనారోగ్య కారణాలతో చేరితే… అటువంటి వారిని మరోసారి పరిశీలించాలని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన పరీక్షలు చేయాలని సూచించింది. దీని కోసం ప్రత్యేకంగా ర్యాపిడ్‌ ‌రెస్పాన్స్ ‌టీంను నియమించారు. ఆర్‌ఆర్‌టీ బృందంలో అదనపు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాథరావు, సోషల్‌ ‌ప్రివెంటివ్‌ ‌మెడిసిన్‌ (ఎస్‌పీఎం) వైద్యుడు డా.శర త్‌, ‌పల్మనాలజిస్టు డా. ఎస్‌.‌చలపతిరావు తదిత రులు ఈ బృందంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా కేసులను గుర్తించేందుకు జ్లలెడ పట్టే కార్యక్రమానికి ఈ బృందం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కిమ్స్ ఆసుపత్రి, రాగోలులోని జెమ్స్, ‌గుజరాతీపేటలో గల ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను సందర్శించింది. అక్కడి వైద్యులు, సిబ్బందితో పాటు రోగులతో చర్చించి… వివరాలు సేకరించింది. వాస్తవంగా కరోనా కేసులు లేకపోవడానికి కారణాలను కూడా బృంద సభ్యులు సేకరించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!