- మరో 61 కేసులు
- నమోదు అయినట్లు వెల్లడి
- 24గంటల వ్యవధిలో ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఇద్దరు మరణించారు. కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 31కి పెరిగింది. ఇప్పటి వరకు ఏపీలో 171 మంది డిశ్చార్జ్ అయ్యారు.అనూహ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో కొత్తగా 3 పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారిలో మొత్తం 171 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు 31 కరోనా మరణాలు సంభవించాయి.
ఇక ప్రస్తుతం 814 మంది చికిత్స పొందుతున్నారు.జిల్లాల వారీ వివరాల ప్రకారం అనంత పురంలో కొత్తగా 5, తూర్పు గోదావరిలో 3, గుంటూరులో 3, కడపలో 4, క్రిష్ణాలో 25, కర్నూలులో 14, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక ప్రకాశం,విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.గడిచిన 24 గంటల్లో 26 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రకాశంలో 11, తూర్పు గోదావరిలో 4, కృష్ణలో 4, కర్నూలులో 3, అనంతపూర్, నెల్లూరులో ఇద్దరి చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. ••ష్ట్రంలో కొత్తగా కర్నూలులో ఒకరు,కృష్ణలో ఒకరు కోవిడ్‌తో మరణించారు.