Take a fresh look at your lifestyle.

కొరోనాభిలాష

నేనొక విషాన్ని
దరికి వస్తే
మీలో దూరే రైబో అణు కేంద్రక
విధ్వసంక క్షిపణిని

చక్కెరల నత్రజని
భాస్వర విస్ఫోటనాన్ని
నా వర్గపు బాక్టీరియా
శీలీంద్ర సోదరులు
దయ నిర్దయలు కలిగివున్నా
నేను దయలేని  క్రూరత్వాన్ని

నేను విశ్వవ్యాప్తమై
విస్తరించినవాన్ని
అది అతి శీతలమైనా
ఉష్ణమైనా, వేడి చెలిమలైనా
అనుకూలతను సాధించినవాన్ని

నిశ్చలత జడతలకు
చోటులేని
నిఘంటువుని
నిరంతర పరివర్తన
ఉత్పరివర్తనాల
నూత్న రేణువుని

తల్లుల గర్భాశయ శిథిల
పాపిలోమాని
పశు సంపదను పొట్టన పెట్టుకుంటున్న
మాడ్‌ ‌కౌ, స్క్రాపిని
మానవాళి ఊపిరితీస్తున్న
సార్స్ ‌కోవిద్‌-19‌ని .
అరణ్యాలపై
ఆంత్రోపొజెనిక్‌కి
జనారణ్యాలపై
విరుచుకపడుతున్న
అంటిడోట్‌ని

ఆహారపు తెంపు  వలల
వైవిధ్య  క్షీణతలపై
విలయతాండవ
ముళ్ళ కిరీట విహంగాన్ని

ఓ మానవా
నాగరికత నిక్వణలో
అపశ్రుతులను మీటినవాడ
తేనెటీగలా తీసుకో
పువ్వులా ఇవ్వు లాంటి
ఇగురాన్ని అలవర్చుకోనంతవరకు
కనిపిస్తే చంపేస్తాం వరకు తెచ్చుకున్న మీ
మృగత్వాన్ని త్యజించనంతవరకు
నేను కదలదల్చుకోలేదు ..

ప్రకృతికి అపురూప సంపద మీరు
విపత్తులపై అప్రతిహత విజయాల
వైజ్ఞానిక సారథులు మీరు
సామాజిక దూరం పెంచుకో
నా గొలుసును తెంపుకో
నన్ను నిశ్శబ్దంగా అంతం చేసుకో
మరల జీవన సౌందర్యాన్ని వెదజల్లుకో!

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy