Take a fresh look at your lifestyle.

‘‌పేట’ను వణికిస్తున్న కొరోనా

  • జిల్లా వ్యాప్తంగా 83కు చేరిన కేసులు
  • జిల్లా కేంద్రంలోనే 55కి చేరువ
  • పలువురు అధికారులపై వేటు..
  • నూతన అదనపు అధికారుల నియామకం
  • భయాందోళనలతో జిల్లా ప్రజలు

జిల్లాలో రోజురోజుకు పదుల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలోనే జిల్లా కేంద్రం లో 54కరోనా కేసులు మంగళవారం ఒక్క రోజే 26కేసులు నమోదు కాగా బుధవారం మరో 3కేసులు నమోదు కావడంతో ఉలిక్కిపడ్డ జిల్లా ప్రజలు. కరోనా వైరస్‌ ‌పట్టణంలోనే కాకుండా జిల్లా మొత్తం వ్యాప్తి చెందుతుంది దీంతో జిల్లా ప్రజలు, గ్రామస్తులు భయం భయంలో ఉన్నారు. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులు, సమీప వ్యక్తులతో ప్రైమ రీ కాంటాక్ట్ ‌చేయడం ద్వారా ఈ సంఖ్య ఎక్కువ అయింది అని ప్రజలు అభిప్రాయడుతున్నారు. ఈ నెల 4న జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదు అయింది. అతడు జిల్లాలో ఒక అపోలో ఫార్మసిలో పనిచేస్తునన్న వ్యక్తితో ఎక్కువ సార్లు ప్రైమరీ కాంటాక్ట్ ‌జరపడం వల్ల అతనితో రెండ వ కేసు కూడా నమోదు అయింది. ఇలా మొ దలుకొని రోజు రోజు కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి అందులో భాగంగా కూరగాయల మార్కెట్‌ ‌కిరాణ షాపు యజమాని స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడంతో అతనికి, అతని కూతురికి కరోనా పాజిటివ్‌ ‌వచ్చింది. ఈ 11న ఒకే రోజు 11కేసులు,16న 16కేసులు, 17న 15కేసులు నమోదు రెండు రోజుల వ్యవధిలోనే 31 కేసులు జిల్లా వ్యాప్తంగా నమోదు అయ్యాయి. మంగళవారం నమోదు అయిన కరోనా పాజిటివ్‌ 26, ‌బుధవారం 3కేసులతో జిల్లా వ్యాప్తంగా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 83కు చేరింది. వీటిలో 55సూర్యాపేట పట్టణంలో మిగిలినవి ఆత్మకూర్‌ ‌మండలం ఏపూర్‌లో 14, తుంగతుర్తి నియోజ కవర్గం తిరుమలగిరి మండలంలో 6, పెన్‌పహా డ్‌లో మండలంలోని అనంతారం గ్రామంలో 1, నాగారం మండలంలో 6, నేరేడుచర్లలో 1, మద్దిరాల మండలం పొలుమల్లలో ఒక్కరు, చివ్వెంల మండలం బిబిగూడెంలో 2 కరోనా పాజిటివ్‌గా తెలింది.

మార్చి 22న జనతా • •ర్ఫ్యూ నిర్వహించగా మరుసటి రోజు నుండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1, 2కేసులు నమోదు కాగా సూర్యాపేట జిల్లాలో ఏప్రిల్‌ 2‌వరకు ఒక్క కేసు నమోదు కాలేదు. ప్రజలు, అధికారుల ఉపిరి పిల్చుకున్నారు. అసలు కథ అప్పుడే మొదలైంది. దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎక్కువ మందికి పాజిటివ్‌ ‌రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్త మై మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి వివరాలు సేక రించి అందరికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణ యించడంతో సూర్యాపేట జిల్లా చివ్వెంల మం డలం, సూర్యాపేట మున్సిపాలిటీ కుడకుడ గ్రామానికి చెంది వ్యక్తి ఒకరు మర్కజ్‌కు వెళ్లివ చ్చారని గుర్తించి అతడిని క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్‌ ‌రావ డంతో ఒక్కసారిగా అధికారుల, ప్రజలు ఉలిక్కిప డ్డారు. అదే కోణంలో వివరాలు చేపడుతున్నారు. ఒకరి నుండి ఒకరికి కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెం దుతూ జిల్లా వ్యాప్తంగా నేటి వరకు 83కు చేరిం ది. ఇంకెంతమంది ఉన్నారో అని ప్రజలు ఆందో ళన పడుతున్నారు. సూర్యాపేట జిల్లానే కాకుండా సరిహద్దులు దాటుతుంది. పాజిటివ్‌ ‌వచ్చిన వారితో పక్క గ్రామాల వారు సన్నిహితంగా మెలగడంతో ఇది సరిహద్దులే కాకుండా చిన్న చిన్న గ్రామాలు, తండాలకు వ్యాప్తి చెందుతుంది. ప్రాణాంతకమైన కరోనా వ్యాధిని నిర్మూలించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌కొనసాగిస్తున్న చాపకింద నీరులా రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో భయాందోళన మధ్య ప్రజలు ఉన్నారు. ఈ కరోనా నుండి ఎప్పుడు బయటపడుతామో అని ప్రజలు వాపోతున్నారు. కరోనాను నియంత్రించడంలో విఫలమయ్యారని పలు అధికారులపై వేటు పడింది. డిస్పి, డిఎంహెచ్‌ఓల వేటు, అలాగే అదనపు అధికారు లుగా ప్రత్యేక అధికారిగా సర్పజ్‌ అహ్మద్‌, ‌మున్సి పాలిటీ ఓఎస్డిగా వేణుగోపాల్‌రెడ్డి, డిఎస్పిగా మోహన్‌కుమార్‌, ‌డిఎంహెచ్‌ఓలుగా సాంబ శివరావులను నియమించారు.

Leave a Reply