సమాజంలో జరిగే సంఘట నలు, విషయాలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో ప్రజలకు చేరవేసే వారధులు, కరోనా వారియర్స్‌గా ముందువరుసలో ఉండేది పాత్రికేయులేన ని డాక్టర్ శరత్ రాధాస్ ఆయుర్వేద బృంద ప్రతినిధి మడిపల్లి మల్లేశ్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులకు వారు రోగ నిరోధక శక్తిని అందజేసే మందులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడారు. నిత్యం జనం మద్యలో ఉండి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న పాత్రికేయులు ఈ మాత్రలు వాడడం ద్వారా కరోనా వైరస్ నియంత్రణకు దోహదం చేస్తాయని సూచించారు. ఆయుర్వేద బృంద సభ్యులు సూర్య బాబు, దాసరి మహేశ్, పరమేశ్, గోదావరిఖని ప్రెస్ క్లబ్ కోశాధికారి దయానంద్ గాంధీ, పాత్రికేయులు పాల్గొన్నారు.