Take a fresh look at your lifestyle.

గాలిలోనూ కొరోనా వ్యాప్తి..

కాలుష్యం కూడా కారణం
గాలి, వెలుతురు విస్తారంగా ఉంటే తక్కువ
రుజువు చేసిన సిసిఎంబి పరిశోధనలు

గాలిలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతున్న జాడలున్నాయని గతంలోనే పాశ్చాత్య దేశాల బృందం ప్రకటించింది. వారు తమ పరిశోధనలను ప్రపంచం ముందుంచారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన సిసిఎంబి కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. అయితే దాని ప్రభావం ముందుగా ఊహించినంత ప్రమాదకరంగా లేదని హైదరాబాద్‌లోని సీసీఎంబీ ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. గాలి వెలుతురు విస్తారంగా ఉన్న ప్రాంతంలో కూడా ప్రభావం తక్కువని గుర్తించారు. దాని ప్రభావం కేవలం రెండు నుంచి మూడు టర్లలోపే ఉన్నట్టు తేలింది. భయంకరమైన ఈ వైరస్‌ ‌గాలిలో వ్యాపిస్తుందా? లేదా? అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నా యి. గాలిలో వైరస్‌ ‌వ్యాప్తికి ఆధారాలున్నాయని వివిధ దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కు నివేదించాయి. ఇదే విషయంపై సీసీఎంబీ ఆధ్వర్యంలో రెండు నెలల నుంచి హైదరాబాద్‌ ‌కేంద్రంగా ఎయిరోసోల్‌ ‌వైరల్‌ ‌ట్రాన్స్‌మిషన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నగరంలో కొరోనా చికిత్సలు అందిస్తున్న కొన్ని దవాఖానలను, ఇతర ప్రాంతాలను శాస్త్రవేత్తలు పరిశోధన కోసం ఎంచుకున్నారు. వైరస్‌ ‌బాధితులు ఎక్కువగా, తక్కువగా ఉన్న ప్రాంతాలతోపాటు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే బాధితులున్న ప్రాంతాల్లోనూ పరిశోధనచేశారు. బాధితులు అధికంగా ఉన్నచోట వైరస్‌ ‌గాలిలో వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. డ్రాప్‌లెట్స్ ‌ద్వారా వెలువడిన వైరస్‌ ‌గాలి, దుమ్ము కణాలలో కలిసి ప్రయాణిస్తున్నట్టు తేల్చారు. కానీ సంబంధిత రోగులనుంచి కేవలం రెండు నుంచి మూడు టర్ల లోపే దాని వ్యాప్తి ఉన్నట్టు కనుగొన్నారు. వెంటిలేషన్‌ ‌లేకుండా చాలావరకు ‘క్లోజ్డ్ ‌డోర్‌’‌లలో వైరస్‌ ‌గాలిలో తిరగాడుతున్నట్టు గుర్తించారు. గాలి, వెలుతురు ధారాళంగా ఉన్నచోట దీని ప్రభావం తక్కువగా ఉన్నట్టు తేలింది. ఒకరిద్దరు ఉన్నచోట గాలిలో కొరోనా కనిపించలేదని తెలుస్తున్నది. ఒక గదిలో 7నుంచి 10 అడుగుల ఎత్తులో వైరస్‌ ‌వ్యాప్తి ఉన్నట్టు సమాచారం. ఇలాంటి ప్రాంతంలో సాధారణ వ్యక్తులకు వైరస్‌ ‌వ్యాపించే అవకాశమున్నదని తేల్చారు.

నలువైపులా ద్వారాలు తెరిచి
వెంటిలేషన్‌ ‌బాగా ఉన్నచోట గాలిలో వైరస్‌ ‌జాడలు అంతలా కనిపించడం లేదని శాస్త్రవేత్తలు తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ఇతర దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నంత తీవ్రంగా లేదని శాస్త్రవేత్తలు నివేదించినట్టు సమాచారం. ఎయిరోసోల్‌ ‌సర్వే ఇంకా కొనసాగుతున్నదని సీసీఎంబీ డైరెక్టర్‌ ‌రాకేశ్‌మిశ్రా చెప్పారు. ఇకపోతే కాలుష్యం కూడా ప్రభావం చూపుతోంది. కాలుష్యం కారణంగా వైరస్‌ ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని సీసీఎంబీ డైరెక్టర్‌ ‌రాకేశ్‌మిశ్రా చెప్తున్నారు. ఢిల్లీలో కాలుష్యం వల్లే వైరస్‌ ‌మరింత విజృంభిస్తున్నదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల వైరస్‌ ‌కట్టడి సాధ్యమైందన్నారు. కానీ రెండో దఫా కొరోనా వ్యాపించే అవకాశాలున్నాయని, ఈ దశలో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నదన్నారు. కొరోనా వైరస్‌ ‌వ్యాక్సిన్‌ ‌కోసం దేశంలో సామాన్య ప్రజలు 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని వైరస్‌పై జాతీయ టాస్క్‌ఫోర్స్ ‌సభ్యుడు, ఎయిమ్స్ ‌ఢిల్లీ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌రణదీప్‌ ‌గులేరియా చెప్పారు. కొరోనా వ్యాక్సిన్‌ ‌భారత మార్కెట్లలో సులభంగా లభించడానికి ఆ తర్వాత ఏడాదికిపైగా పడుతుందన్నారు. వ్యాక్సిన్‌ ‌వొచ్చినంత మాత్రాన కొరోనా వైరస్‌ అం‌తరించిపోదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక న్యూస్‌ ‌చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా రణదీప్‌ ‌గులేరియా మాట్లాడుతూ.. మనదేశంలో జనాభా చాలా ఎక్కువని గుర్తు చేశారు. మార్కెట్‌ ‌నుంచి వ్యాక్సిన్‌ ఎలా కొనుగోలు చేయొచ్చో చూడడానికి తమకు సమయం కావాలన్నారు. కొరోనా వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వొచ్చాక దాన్ని దేశమంతటా మారుమూల ప్రాంతాలకు కూడా చేరేలా పంపిణీ చేయడం అతిపెద్ద సవాల్‌ అని అభిప్రాయపడ్డారు. కోల్డ్ ‌చైన్‌ను నిర్వహించడం, తగినన్ని సిరంజిలు, సూదులు కలిగి ఉండటం కూడా ఇందులో ఎదురయ్యే ప్రధాన సవాళ్లని పేర్కొన్నారు.

Leave a Reply