Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న.. కొరోనా విజృంభణ

వరుసగా రెండోరోజూ 95 వేలకుపైగా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 2,426 మందికి పాజిటివ్‌

భారత్‌లో కొరోనా మహమ్మారి రోజురోజుకూ విశ్వరూపం చూపిస్తోంది. వరుసగా రెండో రోజూ 95 వేలకుపైగా కేసులునమోదయ్యాయి. నిన్న 95,735 పాజిటివ్‌ ‌కేసులు నమోదవగా, ఈరోజు మరో వెయ్యి అధికంగా రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 96,551 మంది కొరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం మొత్తం కేసులు 45,62,415లకు చేరాయి. ఇందులో 9,43,480 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 35,42,664 మంది బాధితులు కొరోనా నుంచి కోలుకున్నారు. ఇక గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 1209 మంది మరణించారు. దీంతో దేశంలో కొరోనాతో చనిపోయినవారి సంఖ్య 76,271కు చేరింది. ఇప్పటివరకు ఒక్కరోజులో కొరోనాతో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 10 ‌వరకు 5,40,97,975 మందికి కొరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎమ్మార్‌) ‌ప్రకటించింది. అదేవిధంగా గురువారం ఒకేరోజు 11,63,542 నమూనాలను పరీక్షించామని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1209 మంది మరణించగా..మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ ‌కేసులు 20.68 శాతం ఉన్నాయి. దేశంలో కొరోనా రికవరీ రేటు 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.67 శాతానికి పడిపోయిందని తెలిపింది.

రాష్ట్రంలో కొత్తగా 2,426 మందికి పాజిటివ్‌
‌తెలంగాణలో కొరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,426 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,52,602 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కొరోనా బారినపడి 13 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 940కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,324 మంది కొరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,19,467గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,195 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.

కాగా..మరో 25,240 కేసులు •ంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. కాగా చికిత్స నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,19,467మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 32,195 కొరోనా యాక్టివ్‌ ‌కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ శాతం 78.2 ఉండగా..మరణాల శాతం 0.61 శాతం ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Leave a Reply