Take a fresh look at your lifestyle.

పుంజుకుంటుంది జాగ్రత్త…!

సద్దుమణిగింది అనుకున్నాం
స్వతంత్రంగా బయటకెళ్తున్నాం
వేడుకలు నిర్వహుంచుకుంటున్నాం
ఆర్భాటాలు చేసుకుంటున్నాం
మునుపటిలా మాస్కులు
వాడటం మానేసాం
హోటళ్లు తెరుచుకున్నాం
జాగ్రత్తలకు స్వస్తిచెప్పుకున్నాం
గుంపులతో మమేకమవుతున్నాం
చేతులు కడుగుడుకు
కొంత విరామమిచ్చాం
శానిటైజర్లకు
పని తగ్గించాం
భయాన్ని వీడినాం
అంతా అయిపోయిందని
కొంత హాయిగా ఉన్నాం
కానీ…
మళ్లీ వేగం పుంజుకుంటుంది
ఉత్పత్తిని పెంచుకోబోతోంది
ఉష్ణం తగ్గగానే
తన పని మళ్లీ ప్రారంభిస్తోంది
మానవులపై
దండయాత్రకు సమాయత్తమవుతోంది
జాగ్రత్త!
కొరోనా కాటుకు బలికాకండి
భౌతిక దూరం పాటిద్దాం
పరిశుభ్రతను ఆచరిద్దాం
– అయిత అనిత, 8985348424

Leave a Reply