Take a fresh look at your lifestyle.

ఖాజీపేట రైల్వే స్టేషన్ లో కలకాలం..

ఖజిపేట్ రైల్వే స్టేషన్ లో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న ఇద్దరిని ట్రైన్ నుండి దింపడం వరంగల్ లో కలకలం రేపింది. ఇండోనేషన్ నుండి హైదరాబాద్ కి వచ్చిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన పూజ తో పాటు ఆమె భర్తకు ఎయిర్ పోర్టులో టెస్టులు నిర్వహించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో వారికి స్టాంపింగ్ చేసి ఐసోలేషన్ లో ఉండాలంటూ సూచించారు. కానీ వాళ్ళు శంషాబాద్ ఎయిర్ పోర్టు లోని ఐసోలేషన్ వార్డుకు వెళ్లకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చి న్యూ ఢిల్లీకి వెళ్లి రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కారు. క్వారంటైన్ కి వెళ్లాల్సిన దంపతులు మిస్ కావడం గుర్తించిన అధికారు అప్రమత్తం అయ్యారు..

- Advertisement -

corona virus positive in Khajipet Railway Station సీసీ టివి ఆధారంగా సికింద్రాబాద్ కి చేరుకున్నటు గుర్తించారు రైల్వేఅధికారులకు సమాచారం ఇవ్వడంతో పూజ ఆమె భర్త అజ్రత్ నిజామోద్దీన్ రైల్ లో బి3 బోగీలో ప్రయనిస్తున్నట్లుగా నిర్ధారించుకొని ఖజిపేట్ లో వాళ్ళను పట్టుకున్నారు. బి3 బోగీలో 3. మరియు 7 వ బెర్త్ లో ఉన్న ఇద్దరు దంపతులను ఖజిపేట్ రైల్వే స్టేషన్ ట్రైన్ దింపి ప్రత్యేక అంబులెన్స్ ఎంజీఎం లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వాళ్లకు కరోనా ఉందా లేదా అని తెలుసుకునేందుకు నమూనాలు సేకరిస్తున్నారు. ఖజిపేట్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ అరగంట నిపివేయడంతో ఏమిజరుగుతుందో అర్ధం కాక ప్రయాణికులు కంగారు పడ్డారు అంతే కాదు బి3 బోగిలో ప్రయాణించిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply