హర్యానా ఆరోగ్య శాఖ మంత్రికి పాజిటివ్
28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వాలి
: భారత్ బయోటెక్ స్పందన
హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్కొన్ని రోజుల క్రితం కొరోనా వైరస్ టీకా ట్రయల్స్‌లో భాగంగా టీకాను వేయించుకున్నారు. అయితే ఆ మంత్రికి వైరస్ సోకింది. ఉదయం తన ట్విట్టర్లో మంత్రి అనిల్ విజ్ ఈ విషయాన్నితెలిపారు. కోవిడ్19 పరీక్షలో పాజిటివ్ తేలినట్లు ఆయన వెల్లడించారు. వాస్తవానికి నవంబర్ 20వ తేదీన మంత్రి అనిల్.. కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. అంబాలా హాస్పిటల్లో జరిగిన మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా మంత్రి ఆయన వాలంటీర్‌గా వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్‌బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి
చేస్తున్న క్రమంలో ఈ టీకా ట్రయల్స్ నిర్వహించారు.
28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వాలి : భారత్ బయోటెక్ స్పందన
మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా రెండు వారాల క్రితం
‘కొవాగ్జిన్’ టీకా షాట్ తీసుకున్న హర్యానా హోం మంత్రి అనిల్ విజ్‌కు కొరోనా సోకడంపై భారత్ బయోటెక్ స్పందించింది. రెండో డోస్ తీసుకున్న 14 రోజుల తర్వాత మాత్రమే టీకా సామర్థ్యాన్ని నిర్ణయించగలమని పేర్కొంది. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ 28 రోజుల వ్యవధిలో రెండు డోసు షెడ్యూళ్ల ఆధారంగా ఉంటాయని తెలిపింది. రెండు డోసులు తీసుకున్న తర్వాత మాత్రమే దాని సమర్థత బయటపడుతుందని పేర్కొంది. కొవాగ్జిన్ మూడో దశ పరీక్షలు రెండు రకాలుగా ఉంటాయి. 50శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వగా, మిగతా 50 శాతం మందికి ప్లాసెబో అనే ద్రావణాన్ని ఇస్తారు. మంత్రికి ప్లాసిబో మాత్రమే ఇచ్చి ఉంటారని, కాబట్టి వైరస్ సోకడంలో వింతే లేదంటున్నారు. రెండో డోస్ కూడా ఇచ్చిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ సామర్థ్యం నిర్దారణ అవుతుందని చెబుతున్నారు. భారత బయోటెక్ అమెరికా, యూకేలోనూ ‘కొవాగ్జిన్’కు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. తాము గత 20 ఏళ్లలో 18 దేశాల్లో 80 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. 80కిపైగా దేశాలకు 4 బిలియన్కు పైగా డోసులు సరఫరా చేసినట్టు పేర్కొంది. భద్రత విషయంలో తమకు గొప్ప ట్రాక్ రికార్డు ఉందని స్పష్టం చేసింది. కొవాగ్జిన్‌కు భారత్‌లో నిర్వహిస్తున్న మూడో దశ ట్రయల్స్ సామర్థ్యానికి సంబంధించినది మాత్రమే. దేశ జనాభాకు ఇది ఎలా సరిపోతుందనే విషయాన్ని నిర్దారించుకునేందుకే ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి.
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలోపాల్గొన్న..
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కొరోనా
ప్రజాతంత్ర, హైదరాబాద్ : రాష్ట్రంలో కొరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొరోనా కట్టడికి చర్యలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు అధికారులు, ప్రజాప్రతినిధుల కొరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రజాప్రతినిధులు హొకొహొరోనా తో హాస్పిటల్ లో చేరారు.
కాగా ఇప్పుడు తాజాగా తెలంగాణకుచెందిన మరో ఎమ్మెల్యేకు కొరోనా పాజిటివ్ వచ్చింది. బెల్లంపల్లి నియోజక వర్గానికిచెందిన తెరాస ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కొరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయననిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే తో పాటు ఆయన గన్ మెన్,ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కొరోనా పాజిటివ్ వచ్చింది.అయితే తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో బన్సీలాల్ పేట డివిజన్లో ఎమ్మెల్యేదుర్గం చిన్నయ్య ఎన్నికల ప్రచారం చేసారు.