Take a fresh look at your lifestyle.

కొరోనా వైరస్‌.. అదృశ్య మహమ్మారైతే..

  • దానిపై పోరాడుతున్న డాక్టర్స్, ‌హెల్త్ ‌వర్కర్స్ అజేయ శక్తి లాంటి వారు
  • రాజీవ్‌గాంధీ వర్సిటీ హెల్త్ ‌సైన్సెస్‌ ‌సిల్వర్‌ ‌జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోడీ
  • మన సోల్జర్స్‌పై దాడులు అనాగరిక చర్యని వెల్లడి
  • కొరోనాపై పోరులో తుది విజయం సాధిస్తామని ధీమా

కరోనా వైరస్‌ అదృశ్య మహమ్మారైతే.. దాంతో పోరాడుతున్న డాక్టర్స్, ‌హెల్త్ ‌వర్కర్స్ అజేయ శక్తి లాంటి వారని ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. ఈ పోరులో మెడికల్‌ ‌వర్కర్స్ ‌తప్పక విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నాటకలోని రాజీవ్‌ ‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ ‌హెల్త్ ‌సైన్సెస్‌ ‌సిల్వర్‌ ‌జూబ్లీ వేడుకలను వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఢిల్లీనుంచి ప్రధాని మోడీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై మాట్లాడారు. మహమ్మారి లేకపోతే ఈ స్పెషల్‌ ‌డే నాడు తో కలసి బెంగళూరులో ఉండటానికి ఇష్టపడతానని మోడీ చెప్పారు.’వైరస్‌ ‌కనిపించని శత్రవు అయ్యుండొచ్చు.. కానీ మన యోధులైన మెడికల్‌ ‌వర్కర్స్‌ను అజేయ శక్తిగా చెప్పొచ్చు. అదృశ్య,అజేయ శక్తుల మధ్య జరుగుతున్న పోరు ఇదని అభివర్ణించారు. మా వైద్య సిబ్బంది కచ్చితంగా గెలుస్తారు. వైరస్‌ ‌ను రూట్‌ ‌లెవల్‌ ‌నుంచి ఎదుర్కోవడంలో మెడికల్‌ ‌కమ్యూనిటీతోపాటు కరోనా వారియర్స్ ‌హార్డ్ ‌వర్క్ ‌దాగి ఉందన్నారు. డాక్టర్లు, మెడికల్‌ ‌వర్కర్స్ ‌కూడా సైనికులే.. వారు యూనిఫామ్‌ ‌లేని సోల్జర్స్ అని ప్రధాని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచం మొత్తం మన డాక్టర్లు, నర్సులు, మెడికల్‌ ‌స్టాఫ్‌, ‌సైంటిఫిక్‌ ‌కమ్యూనిటీ వైపు ఆశగా, కృతజ్ఞతా భావంతో చూస్తోంది.

సఫాయి వర్కర్స్, ‌డాక్టర్స్, ‌నర్సులపై హింస, దూషణ, అనాగరిక ప్రవర్తనను ఆమోదించం అని మోడీ పేర్కొన్నారు. కంటికి కన్పించని శత్రువుపై పోరాటం చేస్తున్న దశలో వారిపై ఎలాంటి అనాగరిక చచర్యలు కూడా ఆమోద యోగ్యం కాదన్నారు. కరోనా యోధులు నిరంతరం కష్టపడుతున్నారని, వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం మంచిదికాదన్నారు. కరోనాపై పోరాటంలో భారత్‌ ‌ముందుందని చెప్పారు. ఆరోగ్యసేతు యాప్‌ను ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్‌ ‌చేసుకోవాలని సూచించారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం అని చెప్పారు. ఈ పథకం ద్వారా రెండేండ్లలో కోటి మంది లబ్దిపొందారని తెలిపారు. మహిళలు, గ్రాణ ప్రాంతాలకు చెందినవారే అత్యధికంగా ఈ పథకంలో లబ్దిపొందరాని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్‌లను ఏర్పాటుచేసుకున్నామని, గత ఐదేండ్లలో ఎంబీబీఎస్‌ ‌సీట్లు 30 వేలు, పీజీ సీట్లు 15 వేలు పెరిగాయని చెప్పారు.

Leave a Reply