Take a fresh look at your lifestyle.

కొరోనా ప్రభావం..!
ఆలయంలో అర్చకులతోనే శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కల్యాణ క్రతువు

  • ‌భక్తులు రావద్దని కోరిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • కల్యాణ బాధ్యతలను ప్రభుత్వ సలహదారు రమణాచారికి అప్పగింత

దక్షిణ అయోద్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణానికి కొరోనా ప్రభావం బారిగా పడింది. ఈ ఏడాది స్వామివారి కల్యాణం కన్నులార చూడటానికి భక్తులకు అదృష్టం లేకపోయింది. రోజురోజుకు కొరోనా ప్రభావం ఎక్కువ కావడంతో కల్యాణాన్ని ఆలయంలోనే ఏప్రిల్‌ 2‌వ తేదీన స్వామి వారి కల్యాణం, 3వ తేది మహాపట్టాభిషేకం అర్చకులతో అష్టోత్తరంగా క్రతువును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్వామివారి కల్యాణానికి భక్తులు ఎవరు రావద్దని కోరారు. గత 15 రోజులుగా కల్యాణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ‌యంవి రెడ్డి ఆదేశాలతో చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులను వెంటనే నిలిపుదల చేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ చేయటంతో పనులు నిలిపివేసారు. మార్చి 1 నుండి స్వామివారి కల్యాణానికి ఆన్‌లైన్‌ ‌టిక్కెట్లు ప్రారంభం అయ్యాయి. 18 వేల టిక్కెట్లలో 1,090 టిక్కెట్లు మాత్రమే అమ్మకం జరిగాయి. ఈ టిక్కెట్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు.

ఆన్‌లైన్‌ ‌ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసిన వాటి డబ్బులను తిరిగి ఇచ్చేందుకు దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం భక్తులకు లేకుండా పోయింది. స్వామివారి కల్యాణ భాధ్యతలను ఈసారి ప్రభుత్వ సలహదారు రమణచారికి అప్పగించటం జరిగింది. అయితే ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నుండి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి తరుపునుండి తీసుకువచ్చే ఆనావాయితి ఉంది. కొరోనా ప్రబావంతో ఈ సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎవరికి అప్పగిస్తారో అని వేచి చూడాల్సిందే.ప్రతీ ఏటా మిధిలా స్టేడియంలో ఉన్న కల్యాణ మండపంలో లక్షలాది మంది భక్తులతో నిండిఉండగా ఆ జనసందోహం మధ్య స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేవారు. ఈ మహోత్తర కార్యక్రమాన్ని భక్తులు కన్నులార చూసి తరించేవారు. కొరోనా ప్రభావంతో కేవలం కొంతమంది అధికారులు, అర్చకులతోనే కల్యాణ క్రతువును నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కల్యాణ క్రతువును టివిల ద్వారా భక్తులు వీక్షించే అవకాశం ఉంది.

ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పటికే స్వామివారి కల్యాణంపై ముమ్మర ప్రచారం జరిగింది. భక్తులు కూడ వివిధ ప్రాంతాల నుండి వచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకిద్దామని ఎంతో భక్తి పారవశంతో ఎదురు చూస్తున్న తరుణంలో కొరోనా ప్రభావం రామయ్య కల్యాణంపై కూడ పడింది. భక్తులు కల్యాణంకు రావద్దని ఎక్కడివారు అక్కడే టివిల ద్వారా తిలకించవచ్చని మంత్రి తెలిపారు. దేవస్థానంలో విక్రయించే స్వామివారి టికెట్ల అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసారు.

Leave a Reply