Take a fresh look at your lifestyle.

ఎపి సచివాలయంలో కనోనా కల్లోలం

వర్క్‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌కోసం ఉద్యోగుల అభ్యర్థన
ఆం‌ధప్రదేశ్‌ ‌సచివాలయంలో కరోనా వైరస్‌ ‌కల్లోలం సృష్టిస్తున్నది. సచివాలయ ఉద్యోగుల్లో కరోనా టెన్షన్‌ ‌నెలకొంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో, మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ 60 మందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు తేలింది.

ఆర్థిక శాఖలో అసిస్టెంట్‌ ‌సెక్రటరీగా పని చేస్తున్న వి పద్మారావు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో సచివాలయంలో 200 మంది ఉద్యోగులకు కొవిడ్‌ ‌టెస్టులు నిర్వహించారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికైనా వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోం అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Leave a Reply