Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ లో 54 % ప్రజల లో కొరోనా వైరస్ యాంటీ బాడీస్

సర్వే లో వెల్లడి .. హార్డ్ ఇమ్యూనిటీ దిశగా హైదరాబాద్ ప్రజలు

హైదరాబాద్,పీ ఐ బీ ,మార్చి 4: సీఎస్.ఐ.ఆర్ (CSIR) – సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) ఇ సి ఎం ఆర్ (ICMR)- జాతీయ పోషకాహార సంస్థ ఎన్.ఐ.ఎస్ (NIN) మరియు భారత బయోఒక్ Bharat Biotech) లు ప్రజలలో కొరోనా వైరస్ తో వచ్చిన యాంటీబాడీస్ ని అంచనా వేశారు.తొమ్మిది వేల మంది నుండి సేకరించిన నమూనాల ఆధారంగా రమారమి 54% ప్రజలలో కొరోనా వైరస్ కు సంబంధించిన యాంటీబాడీస్ తయారయ్యాయని అంటే వీరికి కొరోనా సోకింది అని నిర్ధారించారు.తొమ్మిది వేల మందిలో, హైదరాబాద్ లోని 30 వార్డులలో ఒక్కొక్క వార్డు కి 300 మందిని తీసుకొని యాంటీ బాడీస్ గుర్తించే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 10 సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల లోపు వయస్సు వారిపై నిర్వహించారు కొన్ని వార్డులు 70% లేదా 30% కంటే తక్కువగా చూపించాయి.

ముఖ్యంగా స్త్రీలలో కంటే కొంచెం అధిక సంఖ్యలో 56 శాతం మందికి పురుషులలో 53 శాతం అధికంగా యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. సంవత్సరాల పైబడిన వారిలో యాంటీబాడీలు తక్కువ మంది కేవలం 49% ఉన్నట్లు గుర్తించారు. బహుశా వీరు తీసుకున్న జాగ్రత్తల వల్ల తక్కువేమో అని అనుకుంటున్నారు. కొరొనా వైరస్ సోకిన కుటుంబాలలో ఎక్కువమందిని 78 శాతం మందికి యాంటీబాడీస్ ఉత్పత్తి అయినట్లు బయట వ్యక్తులు బయట సమూహాలు ద్వారా 68 శాతం మందికి సీరో పాజిటివ్ ని కలిగి ఉన్నారు. ఇళ్లలో ఎక్కువగా ఉంది. చిన్న గదులు, చిన్న కుటుంబాల వారిలో కొరోనా వ్యాప్తి తక్కువగా ఉందని డాక్టర్ ఎ. లక్ష్మయ్య వివరించారు.హైదరాబాదులో తొమ్మిది వేల మంది పై నమూనాలు సేకరించి జరిపిన సీరాలాజికల్ పరీక్షల ద్వారా రమారమి 75 శాతం మందికి యాంటీబయాటిక్స్ అభివృద్ధి చెందిన వారు గతంలో లో వీరికి కొరోనా సోకినట్లు కూడా తెలియదని, దీనిని బట్టి కొరోనా ఎంత నిశ్శబ్దంగా వ్యాపిస్తుందో అర్థమవుతుందని జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశకురాలు డాక్టర్: ఎన్. మధుసూదన రావు తెలియజేశారు.

ఈ పరీక్షలలో కొరోనా సోకిన వారికి, సోకని వారిలోనూ ఒకేరకమైన సీరోపాజిటివ్ ఉంది. మొత్తం పరీక్షలు నిర్వహించిన వారిలో 54 శాతం ఉన్నట్లు, వీరిలో కూడా అదే విధంగా ఉంది. అధ్యయన సమూహంలో 18% ముందే పరీక్షించబడి మరియు కొరోనా వైరస్కువైరస్ కు సానుకూలంగా ఉన్నారు. వాటిలో 90% సెరోపోజెటివ్ ఉన్నట్లు కనుగొనబడింది. ఇవి యాంటీబాడీ ప్రతిస్పందనను కలిగి ఉండాలని సూచిస్తున్నాయి. “ఈ అధ్యయనం నగర జనాభాతో కొరోనా వైరస్కువైరస్ కు వ్యతిరేకంగా రక్షణాత్మక రోగనిరోధక ప్రతిస్పందన సమగ్ర దృక్పథాన్ని తెస్తుంది. దీని వల్ల హైదరాబాద్ ప్రజలు సమూహం హార్డ్ ఇమ్యూనిటీ దిశగా పయనిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ పరిశోధనల వల్ల కొరోనా ని ఎదుర్కొనే శక్తిలో ప్రస్తుత స్థితిని తెలియజేస్తుందని ప్రస్తుతం కొనసాగుతున్న టీకాలు ప్రక్రియ వల్ల ప్రజలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని CC.M B నిర్ణేశకులు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలియజేశారు.

Leave a Reply