Take a fresh look at your lifestyle.

కొరోనా వైరస్‌పై..‘వాసం’ సమరం..

“మేడ్చల్‌ ‌జిల్లాలో కొరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కలెక్టర్‌ ‌వాసం వెంకటేశ్వర్లు, ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఓ వైపు లాక్‌డౌన్‌లో కఠినచర్యలు అమలుపరుస్తూనే, దీని ప్రభావంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని తగ్గిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూనే..‘నో మూవ్‌మెంట్‌’ ‌జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాజిటివ్‌ ‌కేసులు నమోదైన కుషాయిగూడ, నేరెడ్‌మెట్‌, ‌రామాంతపూర్‌లను కంటెయిన్‌మెంట్‌ ‌ప్రాంతాలుగా ప్రకటించారు. జిల్లాలోని నాన్‌ ‌జీహెచ్‌ఎం‌సీ ప్రాంతంలో గల నాలుగు కంటెయిన్‌మెంట్‌ ‌జోన్లలో కొత్తగా ఎలాంటి పాజిటివ్‌ ‌లక్షణాలు కన్పించకపోవడంతో బోడుప్పల్‌, ‌చెర్యాల్‌, ‌తుర్కపల్లి, నిజాంపేట్‌ ‌ప్రాంతాల్లో కంటెయిన్‌మెంట్‌ ఎత్తివేసి సడలింపులిచ్చారు.”

పట్టుదలకు మారుపేరు. ఏ పని చేసినా దానికో అర్థం, పరమార్థం ఉండాలంటారాయన. సమస్య ఉన్నచోట కార్యసాధకునిగా మారుతారు. హోదా ఏదైనా ప•ర్ఫెక్ట్‌గా చేయడం ఆయనకు అలవాటు. మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా నియంత్రణకు కంకణం కట్టుకున్నారు. పాలనాదక్షునిగా పేరొందిన ఆయనే..మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ ‌వాసం వెంకటేశ్వర్లు. ఈ మహమ్మారిని తరమడంలో ఆయన తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కలెక్టర్‌ ‌నేతృత్వంలో..కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసులు, వైద్య, పారిశుధ్య సిబ్బంది కలిసికట్టుగా కదులుతున్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల పక్షం రోజులుగా జిల్లా పరిధిలో కొత్త కేసులు నమోదు కాలేదు. పాజిటివ్‌ ‌కేసులు పూర్తిగా నియంత్రణలోకి వస్తుండడంతో జిల్లా అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. బాధితుల కుటుంబ సభ్యులే కాదు.. ప్రజాప్రతినిధులు, ప్రజలు సైతం సంతోషిస్తున్నారు. ముఖ్యంగా రెడ్‌జోన్లో ఉన్న మేడ్చల్‌ ‌జిల్లాను ఆరెంజ్‌ ‌జోన్లోకి తీసుకురావడంలో కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు కృషి ఎంతో ఉన్నది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో..ఆరు జిల్లాలను కేంద్రం రెడ్‌జోన్లుగా ప్రకటించింది. మరో 18 జిల్లాలు ఆరెంజ్‌ ‌జోన్‌ ‌పరిధిలోకి రాగా.. మిగిలినవి గ్రీన్‌జోన్లో ఉన్నట్లు వెల్లడించింది. ఏ రాష్ట్రంలో ఏఏ జిల్లాలు ఏ జోన్‌ ‌పరిధిలోకి వస్తాయో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 130 జిల్లాల్లో రెడ్‌ ‌జోన్‌, 284 ఆరెంజ్‌, 319 ‌జిల్లాలు గ్రీన్‌ ‌జోన్‌ ‌పరిధిలోకి చేర్చారు. దాని ప్రకారం మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా రెడ్‌జెన్లో చేరింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ ‌కేసులతోపాటు, మరణాలు హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, వికారాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలోనే అధికంగా నమోదయ్యాయి.

మృతుల్లో కూడా ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే 82.21 శాతం మంది ఉన్నారు. గత మార్చి నుంచి ఇప్పటి వరకు మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలో 22 కరోనా పాజిటివ్‌ ‌కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఇద్దరు మృతి చెందగా, మిగతావారు చికిత్స పొందుతూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడి కోసం కలెక్టర్‌ ‌మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలు, 13 పురపాలక సంఘాల్లో రెండు వేల మంది సిబ్బందితో ప్రతి రోజు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. టీమ్‌ ‌స్పిరిట్‌తో వైద్యారోగ్య, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ ‌తదితర శాఖల సమన్వయంతో కరోనా కంటెయిన్‌మెంట్‌ ‌జోన్లను పర్యవేక్షిస్తూ, వైరస్‌ ‌వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్నారు. కలెక్టర్‌ ‌వాసం వెంకటేశ్వర్లు, సైబరాబాద్‌, ‌రాచకొండ సీపీలు వీసీ సజ్జన్నార్‌, ‌మహేష్‌ ‌భ•గవత్‌, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, జిల్లా అధికారులతోపాటు, డీఆర్వో, వైద్యాధికారులు, ఆర్డీవోలు, తహసిల్దార్లు, మున్సిపల్‌ ‌కమిషనర్లు, పారిశుధ్య సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది కరోనా నియంత్రణ కోసం నిష్టతో పనిచేస్తున్నారు.

ముఖ్యంగా రాచకొండ, సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్ల సిబ్బంది సహకారంతో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా కరోనా వైరస్‌ ‌నియంత్రణలోకి వచ్చింది. మేడ్చల్‌ ‌జిల్లాలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కలెక్టర్‌ ‌వాసం వెంకటేశ్వర్లు, ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఓ వైపు లాక్‌డౌన్‌లో కఠినచర్యలు అమలుపరుస్తూనే, దీని ప్రభావంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని తగ్గిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూనే..‘నో మూవ్‌మెంట్‌’ ‌జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాజిటివ్‌ ‌కేసులు నమోదైన కుషాయిగూడ, నేరెడ్‌మెట్‌, ‌రామాంతపూర్‌లను కంటెయిన్‌మెంట్‌ ‌ప్రాంతాలుగా ప్రకటించారు. జిల్లాలోని నాన్‌ ‌జీహెచ్‌ఎం‌సీ ప్రాంతంలో గల నాలుగు కంటెయిన్‌మెంట్‌ ‌జోన్లలో కొత్తగా ఎలాంటి పాజిటివ్‌ ‌లక్షణాలు కన్పించకపోవడంతో బోడుప్పల్‌, ‌చెర్యాల్‌, ‌తుర్కపల్లి, నిజాంపేట్‌ ‌ప్రాంతాల్లో కంటెయిన్‌మెంట్‌ ఎత్తివేసి సడలింపులిచ్చారు. జిల్లా యంత్రాంగం గుర్తించిన సంచార రహిత ప్రాంతాల్లో పారిశుధ్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెడ్‌జోన్‌ ‌ప్రాంతాల్లో ప్రతి రోజు సోడియం హైపోక్లోరైట్‌ ‌ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. మల్కాజ్‌గిరి, కీసర రెవెన్యూ డివిజన్లలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులను ఇళ్ల వద్దకే పంపుతున్నారు. లాక్డౌన్‌ ‌నేపథ్యంలో ప్రజల అత్యవసర సేవల కోసం 100,104కు ఫోన్‌ ‌చేసే అవకాశం కల్పించారు.

వైద్యాధికారుల నేతృత్వంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం‌లు ఇతర సిబ్బంది ఇంటింటి సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. కంటెయిన్‌మెంట్‌ ‌ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబు తదితర లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే కలెక్టర్‌ ‌దృష్టికి తీసుకొస్తున్నారు. అధికారులు అవసరమైతే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు మేడ్చల్‌ ‌జిల్లాలో సమన్వయంతో వెంకటేశ్వర్లు ముందుకెళ్తూనే, మరో వైపు వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్‌ ‌పూర్తయిన వారికి, కరోనా సోకి కోలుకున్న వారితోపాటు, ప్రైమ్‌ ‌కాంటాక్ట్ అయి క్వారంటైన్‌లో ఉన్న అందరికీ ఈ కాల్‌ ‌సెంటర్‌ ‌నుంచి ఫోన్‌ ‌చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. తవాఖానా నుంచి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన వారు హోం క్వారంటైన్‌లో ఉంటున్న వారిని దవాఖానాలో పలుమార్లు పరీక్షలు చేసి నెగిటివ్‌ ‌రిపోర్టు వచ్చాకే పంపుతున్నారు. ఇళ్ల వద్ద కూడా అధికారులు వీరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కరోనా కట్టడికి ప్రాధాన్యం ఇస్తూనే, ఇదే సమయంలో గర్భిణులతోపాటు, ఇతర రోగులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. మహమ్మారి కరోనా వైరస్‌ను పారద్రోలే క్రమంలో ప్రాణాలను ఫణంగాపెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు కలెక్టర్‌ ‌పాదాభివందనాలు చేశారు. అంతేగాక వీరితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

కరోనా వైరస్‌ ‌కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ‌పక్కాగా అమలయ్యేలా కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేషుకుమార్‌ ఆదేశాలను, సూచనలను కలెక్టర్‌ ‌విధిగా పాటిస్తూ కరోనా వైరస్‌ ‌నియంత్రణపై సమరం సాగిస్తున్నారు. అలాగే జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌ ‌పోస్టుల వద్ద 24 గంటలు తనిఖీలు చేపడుతూ అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని నియంత్రిస్తున్నారు. అన్ని పత్రాలను పరిశీలించి అంతా సక్రమంగా ఉన్నట్లు తేలితేనే వాహనాలను వదులుతున్నారు. లేని పక్షంలో సీజ్‌ ‌చేసిన వాహనాలను లాక్‌డౌన్‌ ‌ముగిశాక తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేగాక జిల్లాలో సిటిజన్‌ ‌ట్రాకింగ్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా మూడు కిలోమీటర్ల పరిధి దాటి వాహనదారులు ప్రయాణం చేసినట్లు వెల్లడైతే కేసు నమోదు చేస్తున్నారు.

జిల్లాలో పది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత సీజన్లో సుమారు పది వేల మెట్రిక్‌ ‌టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ‌సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇబ్బందిపడుతున్న 92వేల మంది వలస కూలీలకు రెండువిడతల్లో బియ్యం, నగదు పంపిణీ చేశారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలో ఉన్న వలస కూలీలను ప్రత్యేక రైలులో సొంతూళ్లకు పంపించారు. రేషన్‌కార్డు లేని 15వేల మందికి బియ్యం, రూ.500 నగదు, కూరగాయలు, పండ్లు, మందులు ఇప్పించారు. అలాగే 505 మంది ట్రాన్స్‌జెండర్లకు రేషన్‌ ‌సరుకులు అందించారు. జిల్లాలో 4.93 లక్షల రేషన్‌కార్డుదారులు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 1500 నగదును బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమచేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో జిల్లాలోని 3600 పరిశ్రమల్లో పనులు ప్రారంభించి కార్మికులకు పని కల్పించారు. అలాగే వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు సడలింపులిచ్చిన కలెక్టర్‌ ‌గ్రామీణ ఉపాధిహామీ పనులను వేగవంతం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం, గ్రామీణ ఉపాధిహామీ పథకాలను కొనసాగిస్తూనే, కరోనా వైరస్‌ ‌నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటారు కలెక్టర్‌ ‌వాసం వెంకటేశ్వర్లు. స్వీయనిర్బంధం పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చే వారు తప్పక మాస్క్ ‌ధరించాలి. అలాగే భౌతిక దూరం పాటించాలి. ఈ అంశాలపై కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అయితే, కరోనా నివారణ అందరి బాధ్యతంటారు కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు. కరోనా వైరస్‌ ‌కనిపించని శత్రువు..కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండడమే మనముందున్న కర్తవ్యమంటారాయన. అందుకే ప్రజలంతా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ ‌వాసం వెంకటేశ్వర్లు సూచించారు.

Leave a Reply