Take a fresh look at your lifestyle.

భారత్‌లో కొరోనా విలయతాండవం

  • తొలిసారిగా రెండు లక్షలకు చేరువలో రోజువారి కేసులు
  • నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వర్చువల్‌ ‌భేటీ
  •  కట్టడి చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

న్యూ దిల్లీ , జనవరి12 : దేశంలో కొరోనా విజృంభిస్తోంది. కేవలం పదిరోజుల్లోనే మహమ్మారి కేసుల సంఖ్య ఏడు నెలల రికార్డును తుడిచిపెట్టేసింది. దేశంలో మొట్టమొదటి సారిగా రోజూవారి కొరోనా కేసులు లక్ష మార్క్ ‌దాటి రెండు లక్షలకు చేరువలో నమోదయ్యాయి. ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో.. అంతటా ఆందోళన నెలకొంది. సోమ, మంగళ వారాల్లో కొంతమేర కేసులు తగ్గుముఖం పట్టగా, బుధవారం రోజున కేసులు భారీగా పెరడగంతో మళ్లీ ఆందోళన మొదలైంది.  థర్డ్ ‌వేవ్‌ ‌ప్రభావం స్పష్టంగా నిపుణులు చెబు తున్నారు.  29 రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాం తాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగు తున్నది.  120 జిల్లాల్లో రోజూ 10 శాతం మేర పాజిటివిటీ రేటు నమోదవు తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.  మాస్క్ ‌ధరించడం, వ్యాక్సిన్‌ ‌తీసుకోవడం వంటివి చేయడం వలన కొరోనా నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే చాలా రాష్టాల్ల్రో  నైట్‌ ‌కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.  ఈ క్రమంలో గురువారం దేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధాని బేటీ కానున్నారు.  ఒమిక్రాన్‌ ‌వేరయంట్‌ ‌కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 442 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ ‌బులెటిన్‌  ‌విడుదల చేసింది.మంగళవారంతో పోల్చుకుంటే.. కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా 26,657 (15.8శాతం) కేసులు పెరిగాయి. నిన్న కొరోనా నుంచి 60,405 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 9,55,319 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కొరోనా నుంచి 60,405 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ ‌రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే దేశంలో ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 4,868 మందికి ఒమిక్రాన్‌ ‌వేరియంట్‌ ‌సోకింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3,60,70,510 కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,46,30,536 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,84,655 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, దేశంలో పాజిటివిటీ రేటు పది శాతం దాటిపోయింది.  తాజా గణాంకాల ప్రకారం దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 9,55,319 యాక్టీవ్‌ ‌కేసులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో కొరోనాతో 442 మంది మృతి చెందగా, 60,405 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.  దేశంలో మొత్తం 4,868 ఒమిక్రాన్‌ ‌కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇదిలావుంటే కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీకి కొవిడ్‌ ‌పాజిటివ్‌ ‌వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ’తేలికపాటి లక్షణాలతో  కోవిడ్‌ ‌పాజిటివ్‌ అని తేలింది.

అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు వెంటనే కొవిడ్‌ ‌టెస్టులు చేయించుకుని క్వారంటైన్‌ ‌లో ఉండగలరు’అని ట్వీట్‌ ‌చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కూడా గడ్కరీకి  కొవిడ్‌ ‌పాజిటివ్‌గా తేలింది.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌బీహార్‌ ‌సీఎం నితీష్‌ ‌కుమార్‌, ‌కర్ణాటక సీఎం బసవరాజ్‌ ‌బొమ్మై తమకు పాజిటివ్‌ ‌వచ్చినట్లు ఇప్పటికే ప్రకటించారు.మెడికల్‌ ఆక్సిజన్‌ ‌నిల్వలు పెంచుకోవాలి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ దిల్లీలో 1700మంది పోలీస్‌ ‌సిబ్బందికి కొరోనా దేశంలో కొరోనాకేసులు ఎక్కువవుతున్నాయి. రోజురోజుకీ వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం ద నమోదైన  కేసుల సంఖ్య 1.94 లక్షలకు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన మోడీ సర్కార్‌.. అన్ని రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. హాస్పిటల్స్ ‌ల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ ‌నిల్వలు పెంచుకోవాలని, కనీసం 48 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ ‌బఫర్‌ ‌స్టాక్‌ ఉం‌డేలా చూసుకోవాలని పేర్కొంది.

ఈ మేరకు అన్ని రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ ‌సెక్రటరీలకు కేంద్ర హెల్త్ ‌సెక్రటరీ రాజేశ్‌ ‌భూషణ్‌ ఓ ‌లేఖ రాశారు. మెడికల్‌ ఆక్సిజన్‌ ‌నిల్వలు పెంచు కోవాలని ఆ లెటర్‌ ‌లో ఆయన సూచించారు. దీనికి అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలన్నారు. మెడికల్‌ ఆక్సిజన్‌ ‌తయారీ ప్లాంట్ల నిర్వహణ పైనా శ్రద్ధ వహించాలని రాజేశ్‌ ‌భూషణ్‌ ‌కోరారు. ఈ ప్లాంట్ల  పనితీరు, తగినంత ఆక్సిజన్‌ ‌గాఢత ఉండేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు. కొవిడ్‌ ‌రోగులు చికిత్స పొందుతున్న ఆరోగ్య సేవలను విస్తృతపర్చాలని సూచించారు. కాగా, హాస్పిటల్స్ ‌ల్లో ఆక్సిజన్‌ ‌సిలిండర్లు, నిల్వలపై దృష్టి సారించాలని సెంట్రల్‌ ‌హెల్త్ ‌మినిస్టర్‌ ‌మన్సుఖ్‌ ‌మాండవీయ కూడా రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు. ఆయన మంగళవారం కొన్నిరాష్టాల్రఆరోగ్య మంత్రులతో సక్ష నిర్వహించారు. అన్ని రకాల ఆక్సిజన్‌ ఇన్‌‌ఫ్రాస్టక్చర్ల్రు పనిచేసేలా రెడీ చేసుకోవాలని చెప్పారు.

దేశంలో కొరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని.. ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎంతో అవసరం అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ కొరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.  ప్రతిరోజు 30వేలకు పైగా కొరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు ఆంక్షలను విధించింది ఢిల్లీ ప్రభుత్వం. కొరోనా బారిన పడుతున్న వారిలో పోలుసులు ఎక్కువగానే ఉన్నారు.  రీసెంట్‌ ‌గా 1700మంది పోలీసులకు  పాజిటీవ్‌ ‌గా నిర్థారణ అయింది. హోం గార్డుల నుంచి ఉన్నతస్థాయి అధికారులు కొరోనా బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 12 తేదీల మధ్యలోనే 1700 మంది పోలీసులకు కొరోనా పాజిటివ్‌ ‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్‌ ‌శాఖ ప్రకటించింది.  గడిచిన 24 గంటల్లోనే? 21,259 కొరోనానమోదయ్యాయి.  నిన్న ఒక్క రోజే 23 మంది కొరోనా• కారణంగా చనిపోయారు.
బీజేపీ కేంద్ర కార్యాలయంలో కొరోనా కలకలం 42మంది సిబ్బందికి పాజిటివ్‌గా గుర్తింపు దిల్ల్లీలో కొరోనా కలకలం కొనసాగుతోంది.

ఒక్కొక్కరుగా వైరస్‌ ‌బారిన పడుతున్నారు. తాజాగా దేశ రాజధానిలోని  బీజేపీ కేంద్ర కార్యాలయంలో కొరోనా విజృంభించింది. ఆఫీసులో  42 మందికి  పాజిటివ్‌ అని తేలింది. కోవిడ్‌ ‌బారిన పడిన వారిలో సెక్యురిటీ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల కోసం మంగళవారం బీజేపీ కార్యాలయంలోకేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా, యుపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ ‌సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యకుడు నడ్డా, సీనియర్‌ ‌మంత్రులు రాజ్‌ ‌నాఁథ్‌ ‌సింగ్‌, ‌నితిన్‌ ‌గడ్కరీలు సహా పలువురు కేంద్ర మంత్రులు, నాయకులకు కొరోనా సోకింది. తాజాగా ఇప్పుడు స్టేట్‌ ‌పార్టీ ఆఫీసులో  కొరోనా కేసులు రావడంతో బీజేపీ నేతలంతా అప్రమత్తం అవుతున్నారు. క్వారంటైన్‌ ‌లో ఉండి కొరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో కొరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. జనవరి 1 నుంచి 12 వ తేదీ లోపు… దాదాపుగా 1700 మంది పోలీసులు కొరోనా బారిన పడ్డారు. మరోవైపు దిల్ల్లీలో ప్రైవేటు కార్యాలయాలన్నింటిని బంద్‌ ‌చేయాలని పేర్కొంది ప్రభుత్వం. ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. కేవలం హెల్త్, ‌డియా వంటి అత్యవసర విభాగాల్లో పనిచేసిన వారికి మాత్రమే అనుమతులు ఇచ్చింది. నగరంలో బార్లు, రెస్టారెంట్లు కూడా క్లోజ్‌ ‌చేసింది.

ఐఐటీ హైదరాబాద్‌ ‌క్యాంపస్‌లో కొరోనా కలకలం ప్రజాతంత్ర,సంగారెడ్డి,జనవరి12: రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీలు, స్కూళ్లలో కొరోనా విజృంభన కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కొరోనా బారిన పడ్డారు. తాజాగా కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్‌ ‌క్యాంపస్‌లో కొరోనా కలకలం రేగింది. దాదాపు 119 మంది  విద్యార్థులు, ప్రొఫెసర్లకు  పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. విద్యార్థులకు కొరోనాతో మిగిలిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply