Take a fresh look at your lifestyle.

కొరోనా బాధితులు ఇంట్లో ఒంటరిగా ఉండవొచ్చు ..!

  • మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
  • నీతి ఆయోగ్ కూ పాకిన వైరస్

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ : ప్రస్తుతం భారత్ లో కరోనా మరణాల సంఖ్య 934 కి చేరుకుంది. కొత్త కేసులు 6,868 నమోదుకాగా మొత్తం కొరోనా కేసుల సంఖ్య 29,435 కు పెరిగింది. గత 24 గంటల్లో 62 మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం తేలికపాటి కొరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న వ్యాధిగ్రస్థులు ఇప్పుడు ఇంటిలో ఒంటరిగా ఉండవచ్చు. కొత్త మార్గదర్శకాల ప్రకారం, చాలా తేలికపాటి కొరోనా కేసుగా లేదా ప్రీ-సింప్టోమాటిక్ కేసుగా డాక్టర్లు పరిగణిస్తే బాధితులకు ఇంటిలో కొరెంటైన్ సిఫారసు చేయవచ్చు. అయితే ఇతర కుటుంబసభ్యలతో సంబంధాన్ని నివారించడానికి నివాసంలో అవసరమైన స్వీయ-ఐసోలేషన్ సౌకర్యం ఉండాలి.

మరో వైపు నీతి ఆయోగ్ భవనంకి 48 గంటలు కోసం తాళం పడింది. నీతి ఆయోగ్ లో ఒక అధికారి కోవిద్-19 పాజిటివ్‌గా తేలారని మంగళవారం పరీక్షించిన తరువాత నీతి ఆయోగ్ ప్రకటించింది .నీతి ఆయోగ్ లో శానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, రాబోయే రెండు రోజుల్లో ప్రతి గది కారిడార్ శానిటైజేషన్ చేస్తామని నీతి ఆయోగ్ వర్గాలు తెలిపాయి.ప్రపంచ వ్యాపితముగా కరోనా వైరస్ సృష్టిస్తున్న విధ్వంశం ఇలా వుంది. గత డిసెంబర్‌లో చైనాలో కరోనా వైరస్ వ్యాపించి నప్పటి నుండి ప్రపంచ జనాభాలో 3 మిలియన్లపైగా కరోనావైరస్ బారిన పడింది, 2,11,167 మంది మరణించారు. యునైటెడ్ స్టేట్స్ 987,022 కి పైగా కేసులు 56,144 మందికి పైగా మరణించారు. స్పెయిన్ లో 2,29,422 కరోనా కేసులు , ఇటలీలో 1,99,414, ఫ్రాన్స్ లో 1,62,220, జర్మనీలో 1,58,142, యునైటెడ్ కింగ్‌డమ్ లో 1,54,038, టర్కీలో 110,130 కేసులు నమోదు అయ్యాయి.

  • హోమ్ కొరెంటైన్ మార్గదర్శకాలు ఇలా వున్నాయి
  • కోవిడ్ -19 వస్తే ఇంటిలో కొరెంటైన్ ఉండటానికి ఎవరు అర్హులు?

కింది నియమాలు పాటించే వ్యక్తులు కరోనా వైరస్ సోకినా ఇంటిలో కొరెంటైన్ ఉండటానికి అర్హులు.
i. చికిత్స చేసే డాక్టర్ రోగికి చాలా తేలికపాటి కరోనా కేసుగా / ప్రీ-సింప్టోమాటిక్ కేసుగా పరిగణించాలి.
ii. ఇటువంటి సందర్భాల్లో రోగి నివాసంలో స్వీయ-ఒంటరితనం కోసం కుటుంబ సభ్యలతో కలవకుండా ఉండేలాగా స్వీయ నిర్బంధానికి అవసరమైన సౌకర్యం ఇంటిలో ఉండాలి
iii. 24 × 7 సంరక్షణ అందించడానికి ఒక సంరక్షకుడు అందుబాటులో ఉండాలి. సంరక్షకునికి హాస్పిటల్ మధ్య కమ్యూనికేషన్ లింక్ అనేది ఉంటేనే హోమ్ కొరెంటైన్ కి అనుమతి దొరుకుతుంది.
iv. వ్యాధి గ్రస్తుని సంరక్షకుడు, సన్నిహిత పరిచయాలు వైద్య అధికారి సూచించిన ప్రోటోకాల్ ప్రకారం చికిత్స చేసే వైద్య అధికారి సూచించిన విధంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రొఫిలాక్సిస్ తీసుకోవాలి.
v. వ్యాధికి గురయిన వారు తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
vi. వ్యాధిగ్రస్తుడు తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి నిఘా బృందాలకి సహకరించాలి. జిల్లా నిఘా అధికారికి క్రమం తప్పకుండా తన ఆరోగ్య పరిస్థితి తెలుపుతూ ఉండాలి .
vii.ప్రభుత్వం విధించిన ఇంటిలో కొరెంటైన్ కి సంబందించిన నిర్బంధ మార్గదర్శకాలను అనుసరిస్తాను అని వ్యాధికి గురయిన వారు స్వీయ-కొరెంటైన్ పై ఒక ఫారం నింపి చెప్పాలి.
viii.ముందస్తు వ్యాధిలక్షణలు ఎలా గుర్తించాలి ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలి?
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే, ఛాతీలో నిరంతర ఒత్తిడి లేదా నొప్పిగా ఉంటే, మానసిక గందరగోళం, పెదవుల లేదా ముఖం నీలిరంగుకు మారుతుంటే వైద్య సహాయం తీసుకోవాలి. చికిత్స చేసే డాక్టర్ సలహా ఇస్తే హోమ్ కొరెంటైన్ పాటించాలి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!