Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొరోనా బాధితులు.. 55,532

  • 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసులు 1,473
  • రాజకీయ ప్రముఖులనూ వదలని వైరస్‌

తెలంగాణలో కొరోనా బాధితుల సంఖ్య 55వేలు దాటింది. మృతుల సంఖ్య అధికా రికంగా 500కు చేరువగా ఉంది. కొత్తగా 24 గంటల్లో 1,473 పాజిలివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కొరోనా బాధితుల సంఖ్య 55,532కు చేరింది. అందులో 42,106 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 12,955 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 471గా ఉంది. కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే 85 నుంచి 90 పాజిటీవ్‌ ‌కేసులు నమోదవుతుండేవి.. కానీ గడిచిన మూడు వారాల నుంచి హైదరాబాద్‌లో కాకుండా మిగిలిన 32 జిల్లాల నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే హైదరాబాద్‌లో వైరస్‌ ‌వ్యాప్తి తగ్గుతుండగా.. జిల్లాల్లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకు కొరోనా ప్రభావంలేని జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా, నల్గొండ, ఆదిలాబాద్‌ ‌జిల్లాల్లో కూడా పాజిటీవ్‌ ‌కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసులు  పెరుగుతున్నాయి.

వైరస్‌ ‌బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ప్రజాప్రతినిధుల చుట్టూ వైరస్‌ ‌తిరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌ ‌నగర మేయర్‌కు కోవిడ్‌ ‌నిర్దారణ అయింది. ఇక జిల్లాల్లో వైరస్‌ ‌విజృంభణ తీవ్రంగా ఉంది. ఇటు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చాలా మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రజాప్రతినిధుల్లో కొందరు కొరోనా బారిన పడ్డారు. ఇప్పుడు వారి కుటుంబసభ్యులు, గన్‌ ‌మెన్‌, ‌వాచ్‌ ‌మెన్‌, ఇతర సిబ్బందికి వైరస్‌ ‌సోకుతోంది. శాసనమండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, కొడుకు, కోడలు, ఇద్దరు పనివాళ్లు, వారి ఇద్దరు పిల్లలు వైరస్‌ ‌బారిన పడ్డారు. అయితే ఈ ఆరుగురు వైరస్‌ ‌నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఖమ్మం జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కొరోనా నిర్దారణ కాగా వారు హైరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇలా రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయే గానీ తగ్గడంలేదు. సూర్యాపేట జిల్లాలో వైరస్‌ ‌వ్యాప్తి కొనసాగుతోంది. అనేక మంది వైరస్‌ ‌బారిన పడుతున్నారు. తాజాగా తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ఆర్‌ఎం‌పీ కొరోనాతో మృతి చెందాడు. ఆర్‌ఎం‌పీకి వైరస్‌ ‌సోకడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!