Take a fresh look at your lifestyle.

వివిధ దశల్లో .. కొరోనా వ్యాక్సిన్లు

ఒకట్రెండు రోజుల్లో మూడవ దశ పరీక్షలు
నీతి ఆయోగ్‌ ‌సభ్యుడు వికె పాల్‌ ‌వెల్లడి

మరణాల రేటు కూడా 2 శాతం లోపే..రికవరీ రేటు పెరిగింది : కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ ‌భూషణ్‌
‌భారత్‌లో అభివృద్ధి చెందుతున్న మూడు కొరోనా వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా, వాటిలో ఒక వ్యాక్సిన్‌ ఒకట్రెండు రోజుల్లో మూడవ దశ పరీక్షలకు చేరుకుంటుందని నీతి ఆయోగ్‌ ‌సభ్యుడు వీకే పాల్‌ ‌తెలిపారు. కొరోనా వ్యాక్సిన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రజలకు ఇచ్చిన భరోసాకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. మరోవైపు సోమవారం దేశంలో అత్యధికంగా 9 లక్షల వైరస్‌ ‌పరీక్షలు నిర్వహించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3,09,41,264 పరీక్షలు జరిపినట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 57,584 మంది కొరోనా వైరస్‌ ‌నుంచి కోలుకున్నారని, ఇదే సమయంలో వ్యాధి బారినపడిన 55,079 మంది కంటే రికవరీలు అధికంగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో యాక్టివ్‌ ‌కేసుల కంటే కోలుకున్న రోగులు మూడు రెట్లు అధికంగా ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 ‌నుంచి 19.77 లక్షల మంది కోలుకున్నారని వెల్లడించారు. కొరోనా మరణాల రేటు కూడా 2 శాతం లోపే ఉందని, రాబోయే రోజుల్లో దీన్ని ఒక శాతానికి తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

కాగా మహమ్మారి నుంచి కోలుకున్న రోగుల్లో కోవిడ్‌ అనంతర లక్షణాలపై శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాగా, భారత్‌ ‌బయోటెక్‌, ‌జైడస్‌ ‌క్యాడిల్లా, సీరం ఇనిస్టిట్యూట్‌లు కొరోనా వైరస్‌ ‌నిరోధానికి దేశీ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంలో తలమునకలయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో అత్యధిక కరోనా పరీక్షలు చేయగా, కోలుకున్న వారి సంఖ్య ఇప్పుడు సుమారు 20 లక్షల వరకు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ ‌భూషణ్‌ ‌మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ కొరోనా మరణాల శాతం 2 కంటే తక్కువగా ఉందన్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 9 లక్షల పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మొత్తం 8,99,864 పరీక్షలు చేయగా..ఇప్పటివరకు 19.70 లక్షలకు పైగా రోగులు కొరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 25 శాతం యాక్టీవ్‌ ‌కేసులు ఉన్నాయన్నారు. రోజుకు సగటున 55000 మంది రికవరీ అవుతున్నారన్నారు. ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా ప్రజలకు పరీక్షలు చేశామన్నారు. పాజిటివ్‌ ‌శాతం వారానికి 10 నుంచి 7.72 శాతానికి తగ్గిందని, ప్రతి ఒక్కరూ మాస్కులు, ధరించి భౌతిక దూరం పాటిస్తూ కొరోనాను తరిమేయాలని భూషణ్‌ ‌పిలుపునిచ్చారు. పూణె సర్వేలో ఆసక్తికర విషయాలు ఇటీవల పూణెలో చెపట్టిన సెరో సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి.

పూణెలో వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 1664 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా.. వారిలో 51.1 శాతం మందిలో కొరోనా నిరోధక యాంటీబాడీలు ఉన్నట్టు వెల్లడైంది. అంటే.. వీరందరూ ఏదోక సమయంలో వైరస్‌ ‌బారిన పడి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్ అం‌డ్‌ ‌రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌), ‌పూణె మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌సారథ్యంలో ఈ సర్వే జరిగింది. ఓ ప్రాంతంలో ఎంత మంది కొరోనా బారిన పడి ఉంటారో తెలుసుకోవడమే ఈ సర్వే ఉద్దేశ్యమని ఐఐఎస్‌ఈఆర్‌ ‌వెల్లడించింది. అయితే.. యంటీబాడీలు ఉన్నవారు రెండో సారి కొరోనా బారిన పడతారో లేదో ఈ అధ్యయనం ద్వారా చెప్పలేమని స్పష్టం చేసింది. కానీ.. సర్వే జరిగిన ప్రాంతాల్లో మాత్రం వైరస్‌ ‌విస్తృతంగా వ్యాపించినట్టు ఫలితాలు చెబుతున్నాయని ఐఐఎస్‌ఈఆర్‌ ‌వ్యాఖ్యానించింది. వ్యాధి బారిన పడ్డ మహిళలు, పురుషుల శాతంగా ఒకేలా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply