Take a fresh look at your lifestyle.

దేశంలో పంపిణీకి సిద్ధ్దంగా కొరోనా టీకా

  • ఎమర్జెన్సీ వాడకం కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థలు
  • ట్రయల్‌ ‌దశలో ఆరు రకాల టీకాలు
  • కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ ‌భూషణ్‌ ‌వెల్లడి

సీరం ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియాతో పాటు భారత్‌ ‌బయోటెక్‌ ‌సంస్థలు.. కోవిడ్‌ ‌టీకా ఎమర్జెన్సీ వాడకం గురించి దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు. కోవిడ్‌19 ‌పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డియాకు వివరణ ఇచ్చారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు, శాస్త్రవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారని, ఆరు రకాల టీకాలు ప్రస్తుతం భారత్‌లో ట్రయల్‌ ‌దశలో ఉన్నాయని రాజేశ్‌ ‌తెలిపారు. మరికొన్ని వారాల్లో కొన్నింటికి అనుమతి దక్కే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

శాస్త్రవేత్తల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ ‌వచ్చిన వెంటనే.. టీకాలను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేస్తామన్నారు. దీని కోసం అన్ని ప్రణాళికలు చేశామని, ఉత్పత్తికి, పంపిణీకి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అతి తక్కువ సమయంలోనే అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా చూస్తామన్నారు. మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌, ‌ఢిల్లీ రాష్టాల్లోన్రే 54 శాతం యాక్టివ్‌ ‌వైరస్‌ ‌కేసులు ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ‌కేసులు పెరిగినట్లు రాజేశ్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు. సెప్టెంబర్‌ ‌నుంచి ఇండియాలో కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో కరోనా యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 4 లక్షలకు కన్నా లోపే ఉందన్నారు. మొత్తం కేసులతో పోలిస్తే, ఆ సంఖ్య నాలుగు శాతం కన్నా తక్కువగా ఉందన్నారు.

కేసు పాజిటివిటీ రేటు తగ్గుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి వెల్లడించారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించే విషయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, కేంద్రం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి వ్యాక్సిన్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. వ్యాక్సినేషన్‌ అనేది కేవలం రాష్ట్రాలు కేంద్రాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యం అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొదటగా.. వ్యాక్సిన్‌ను 3 కోట్ల మంది హెల్త్ ‌వర్కర్లకు, ఫ్రంట్‌లైన్‌ ‌వర్కర్లకు అందించనున్నట్లు రాజేష్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు. వ్యాక్సిన్‌ అభివృధ్ధికి సంబంధించి కూడా రాజేష్‌ ‌భూషణ్‌ ‌శుభవార్త చెప్పారు. మన శాస్త్రవేత్తల నుంచి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌రాగానే పెద్ద మొత్తంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని వేగవంతం చేసి ప్రతీ ఒక్కరికీ తక్కువ కాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

Leave a Reply