Take a fresh look at your lifestyle.

వొచ్చే ఎప్రిల్‌ ‌నాటికి కొరోనా వ్యాక్సిన్‌

‌రూ.1000 వరకు ధర
సీరం ఇన్‌స్టిట్యూట్‌ ‌కీలక ప్రకటన
ముందే అందిస్తామన్న ఫైజర్‌

కొరోనా వ్యాక్సిన్‌ ‌లభ్యత, ధరపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో సీరం ఇన్స్‌స్టిట్యూట్‌ ‌కీలక విషయాన్ని ప్రకటించింది. 2021 ఏప్రిల్‌ ‌నుంచి సాధారణ ప్రజలకు కొరోనా వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి తీసుకొస్తామని సీరం సీఈఓ అదర్‌ ‌పూనావాలా
ప్రకటించారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ ‌ధర రూ.1000 వరకు ఉంటుందని తెలిపారు. రెండు డోసుల తమ వ్యాక్సిన్‌ను 5 నుంచి 6 డాలర్ల చొప్పున అంటే సుమారు వెయ్యి రూపాయలకు అందిస్తామన్నారు. ఫలితాలు, నియంత్రణ ఆమోదాలను బట్టి 2021 ఫిబ్రవరి లోపు హెల్త్ ‌కేర్‌ ‌సిబ్బందికి, వృద్ధులకు కొరోనా వ్యాక్సిన్‌ అం‌దుబాటులో ఉంటుందన్నారు. అలాగే ఏప్రిల్‌ ‌నాటికి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండనుందని పూనావాలా తెలిపారు. ఫిబ్రవరి నుంచి నెలకు సుమారు 10 కోట్ల మోతాదులను తయారు చేయాలని ఎస్‌ఐఐ ‌యోచిస్తోందని ఆయన చెప్పారు. 2024 నాటికి దేశంలోని అందరికి కొరోనా వ్యాక్సిన్‌ అం‌దుబాటులో ఉంటుందన్నారు. ఆక్స్ ‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం ఇండియాలోని సీరం ఇన్ట్సిట్యూట్‌తో కలిసి కొరోనా వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు దేశీయంగా భారత్‌ ‌బయోటెక్‌ ‌రూపొందిస్తున్న కోవాగ్సిన్‌ ‌మూడవ దశ ప్రయోగాలు ప్రారంభం అయ్యాయి. అన్ని సవ్యంగా జరిగితే మరి కొన్నిరోజుల్లోనే కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ ‌డెలివరీ షురూ కానుంది. ఈ మేరకు బయోఎన్‌టెక్‌  ‌సీఈవ్‌ ఉగుర్‌ ‌సాహిన్‌  ‌రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.

ఈ ఏడాది క్రిస్మస్‌ ‌కంటే ముందే ఫైజర్‌ అభివృద్ధి చేసిన కొరోనా వైరస్‌ ‌వ్యాక్సిన్‌ ‌డెలివరీ మొదలు పెట్టనున్నామని భావిస్తున్నామన్నారు. తమ కొరోనా టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు అమెరికా కంపెనీ పైజర్‌ ‌ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగుర్‌ ‌సాహిన్‌  ‌వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. అన్నీ సానుకూలంగా జరిగితేనే డిసెంబర్‌ ‌మధ్యలో టీకాకు అనుమతి లభిస్తుందని, క్రిస్మస్‌ ‌పండుగ లోపే డెలివరీలు ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నామన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply