Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా ఉచితంగా కొరోనా టీకా

బాధ్యత కేంద్రానిదే..అన్ని రాష్ట్రాలకు సరఫరా
జూన్‌ 21 ‌నుంచి18 ఏళ్లు నిండిన వారందరికీ
రాష్ట్రాలు పైసా కూడా భరించాల్సిన అవసరం లేదు
ఉచిత వ్యాక్సినేషన్‌పై కొత్త గైడ్‌లైన్స్
‌ప్రైవేట్‌ ‌దవాఖానాల సర్వీస్‌ ‌ఛార్జి రూ.150 మాత్రమే
నవంబర్‌ ‌నాటికి 80 శాతం వ్యాక్సినేషన్‌
‌కొరోనాతో యుద్ధంలో భారత్‌ ‌గెలుస్తుంది
టీకా తయారీలో దేశం స్వయం సమృద్ధి
తయారుచేస్తున్న 7 కంపెనీలు..మరో మూడు కంపెనీలు సిద్ధం
గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజన పథకం దీపావళి వరకు పొడిగింపు
జాతిని ఉద్దేశించి ప్రసంగంలో ప్రధాని మోడీ

వ్యాక్సినేషన్‌ ‌బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రాలు టీకాపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రమే టీకాలు కొని రాష్ట్రాలకు ఇస్తుందన్నారు. ఈ విషయంపై కేంద్రం, రాష్ట్రాలు కలసి రూట్‌మ్యాప్‌ ‌రూపొందిస్తాయని కూడా అన్నారు. సోమవారం సాయంత్రం జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ప్రధాని మోడీ పలు నిర్ణయాలు ప్రకటించారు. కోవిడ్‌ ‌సెకెండ్‌ ‌వేవ్‌ ‌నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్‌ ‌లభ్యత, స్వదేశీ టీకాల అభివృద్ధి తదితర కీలక విషయాలపై ప్రధాని ప్రసంగించారు. కేంద్రమే టీకాలు సమకూర్చి ఉచితంగా ఇస్తుందని ప్రధాని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 25 శాతం వ్యాక్సినేషన్‌ ‌పనిని రాష్ట్రాలు చేస్తున్నప్పటికీ, ఇప్పుడు కేంద్రమే ఆ బాధ్యత కూడా తీసుకుంటుందని, రాబోయే రెండు వారాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ఈనెల 21 నుంచి 18 ఏళ్ల పైబడిన వారికి ఉచిత టీకా ఇస్తున్నట్టు కూడా ప్రధాని ప్రకటించారు. ప్రైవేటు హాస్పిటళ్లు టీకాలపై సర్వీస్‌ ‌చార్జి కింద కేవలం రూ.150 మాత్రమే వసూలు చేయాల్సి ఉటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే కొరోనా పోరుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. వ్యాక్సినేషన్‌ ‌జరుగుతున్న తీరును వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా విమర్శించడంతో పాటు సుప్రీమ్‌ ‌కోర్టు కూడా కేంద్రాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నించింది. దీంతో మోదీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. 21 నుంచి రాష్ట్రాలకు టీకా సరఫరా చేస్తామన్నారు. వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం ఇక పూర్తిగా కేంద్రం పరిధిలోనే జరగనుందన్నారు.

అలాగే ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లకు 25 శాతం డోసులు ఇస్తామని ప్రధాని ప్రకటించారు. సెకండ్‌ ‌వేవ్‌ ‌తర్వాత మొదటి సారి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. కొరోనాతో యుద్ధంలో భారత్‌ ‌గెలుస్తుందని, నవంబర్‌ ‌నాటికి 80 శాతం వ్యాక్సినేషన్‌ ‌పూర్తి చేస్తామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. టీకా తయారీలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడ్డామ ని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలో టీకాలు తయారు చేయడంలో శాస్త్రవేత్తలు సక్సెస్‌ అయ్యారని ప్రశంసించారు. మన శాస్త్రవేత్తలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. ఇంత జనాభా గల దేశంలో టీకా తయారు చేసుకోకపోతే మన పరిస్థితి ఏమిటని అన్నారు. కేంద్రం తీసుకున్న ఖచ్చితమైన నిర్ణయాల వల్లే దేశంలో కొరోనాను నియంత్రించడానికి టీకాలు అందుబాటులోకి వొచ్చాయని మోదీ చెప్పారు. టీకా తయారీ సంస్థలకు, క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌చేపట్టడానికి కేంద్రం మద్దతు తెలిపిందన్నారు. టీకాల తయారీలో గతంలో మాదిరిగా చేస్తే వ్యాక్సినేషన్‌ ‌పక్రియ పూర్తి చేయడానికి 40 ఏండ్లు పట్టేదని మోదీ వ్యాఖ్యానించారు.

వ్యాక్సినేషన్‌లో ఏ దేశంతోనూ వెనుకబడి లేమని, దేశం స్వయం సమృద్ధిగా మారిందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏడు ఫార్మా కంపెనీలు టీకాలు తయారు చేస్తున్నాయని తెలిపారు. మరో మూడు కంపెనీలు తాము తయారు చేసిన టీకాలపై క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌నిర్వహిస్తున్నాయన్నారు. చిన్నారులకు టీకా తయారు చేయడానికి భారీగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. మరోవైపు నాసల్‌ ‌స్ప్రే టీకా కోసం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశీయ అవసరాలకు అనుగుణంగా త్వరలోనే టీకాల ఉత్పత్తి వేగవంతం అవుతుందని చెప్పారు. పేదలు, చిన్నారులకు అన్ని రకాల టీకాలు 90 శాతం వేయగలిగామన్నారు. ఇప్పటి వరకు 23 కోట్ల టీకా డోసులు ఇచ్చామని చెప్పారు.

టీకాలకు సంబంధించి కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని, ఇలాంటి వారందరినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొరోనా కారణంగా పేదలను ఆదకుకునేందుకు దీపావళి వరకు పీఎం గరీబ్‌• ‌కళ్యాణ్‌ అన్నదాన యోజన పథకం కొనసాగు తుందని, పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని అన్నారు. ఎవరూ ఆకలితో బాధపడొద్దనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది పేదలు ఉచిత రేషన్‌ అం‌దుకుంటారని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడాది కూడా కోవిడ్‌ ‌సమయంలో కొన్ని నెలల పాటు ఈ స్కీమ్‌ను కేంద్రం అమలు చేసింది.

Leave a Reply