Take a fresh look at your lifestyle.

ఫస్ట్ ‌డోస్‌..‌సెకండ్‌ ‌డోస్‌ ఏదయినా ఎదురుచూపులే

కరోనా విజృంభణ వేళ ప్రజల్లో ఆందోళన
గుంటూరు : జిల్లాలో కరోనా విజృంభణతో ప్రజలు వ్యాక్సిన్‌ ‌వేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. తమకు టీకా ఎప్పుడు అందుతుందో అర్థం కాక రెండో డోసు వ్యాక్సిన్‌ ‌కాల వ్యవధి ముగిసిపోతున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇక మొదటి డోసు వేయించుకోవాలి అనుకునే వారి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. వ్యాక్సిన్‌ ‌సరఫరా మాత్రం అంతంతగానే ఉంటోంది. వారంలో నాలుగైదు రోజులే వ్యాక్సినేషన్‌ ‌పక్రియ సాగుతోంది. వ్యాక్సిన్‌ ‌సరఫరా కొరతతో మిగిలిన రోజుల్లో టీకాల కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ ‌పక్రియ వేగవంతం కావడంలేదు. శాశ్వత కేంద్రాలు ఏర్పాటు చేసినా అరకొరగా వ్యాక్సిన్‌ ‌పంపిణీ జరుగుతున్నది.

తమకు ఎప్పటికి వ్యాక్సిన్‌ అం‌దుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో వ్యాక్సిన్‌ ‌వేయించుకునేందుకు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరు లోగా రెండో డోస్‌ ‌వ్యాక్సిన్‌ ‌పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నా అందుకు తగ్గట్టు వ్యాక్సిన్‌ ‌సరఫరా కావడంలేదు. జిల్లాలో కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ అధికంగా ఇచ్చారు. వీరందరికీ రెండో డోసు షెడ్యుల్‌ను ప్రకటించినప్పటికీ ఆ మేరకు వ్యాక్సిన్‌ ‌పంపిణీ జరగడంలేదు. కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వ్యాక్సిన్‌ అం‌దరికీ త్వరతగతిన అందించాలని జిల్లావాసులు కోరుతున్నారు. గత వారం నుంచి గుంటూరు నగరంలో తగ్గుతూ వచ్చిన కేసులు శుక్రవారం మళ్లీ పెరిగాయి.

మరో 10 రోజుల వ్యవధిలో సెకండ్‌ ‌డోస్‌ ‌పక్రియ మొత్తం పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి మళ్లీ ఫస్టు డోస్‌ ‌పక్రియని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో కొవిడ్‌-19 ‌నియంత్రణ కోసం సత్వర చర్యలు తీసుకునేందుకు మండల స్థాయి కొవిడ్‌ ‌వార్‌ ‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ‌వివేక్‌యాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ మండల కేంద్రంలో వార్‌ ‌రూమ్‌లు 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేయాలని మండలాధికారులను ఆదేశించారు. వార్‌ ‌రూమ్‌ ‌కమిటీకి తహసీల్దార్‌ ‌చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎంపీడీవో, ఎస్‌హెచ్‌వో, మండల వైద్య అధికారి, మెడికల్‌ ‌సూపర్‌వైర్లు సభ్యులుగా ఉంటారు. ఈ వార్‌ ‌రూమ్‌లో కాల్‌సెంటర్‌ని ఏర్పాటు చేస్తామన్నారు. మునిసిపాలిటీల్లోనూ కొవిడ్‌ ‌వార్‌ ‌రూమ్‌ ‌కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రైఏజింగ్‌ ‌నిర్వహించడానికి వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇంటింటికి తిరిగి ఫీవర్‌ ‌సర్వే సక్రమంగా జరిగేలా పరిశీలన చేయాలని ఆదేశించామన్నారు.

Leave a Reply