Take a fresh look at your lifestyle.

కొరోనా వ్యాక్సిన్‌ ‌పరీక్షలకు ముందే యాంటీబాడీస్‌

ఎం‌పిక చేసిన వ్యక్తుల్లో గుర్తించిన ఎయిమ్స్ ‌వైద్యులు
సప భవిష్యత్‌లో వ్యాక్సిన్‌ అసాధ్యం : డబ్ల్యుహెచ్‌ఓ
160‌కోట్ల మంది విద్యార్థులపై కొరోనా ప్రభావం : యుఎన్‌ఓ

ప్రంపచ వ్యాప్తంగా  కొరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరిందింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాక్సిన్‌ ‌పరీక్షలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఆల్‌ ఇం‌డియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌సైన్సెస్‌ (ఎయిమ్స్)‌లో దేశీయ వ్యాక్సిన్‌ అయిన కోవాక్సిన్‌కు సంబంధించిన హ్యమన్‌ ‌ట్రయల్స్ ‌రెండు వారాల క్రితం ప్రారంభమయ్యీయి. అయితే వీటికి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్లినికల్‌ ‌హ్యూమన్‌ ‌ట్రయల్‌లో పాల్గొనే 20 శాతం వాలంటీర్లు ఇప్పటికే తమ శరీరంలో కొరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే ప్రతిరోధకాలను కలిగి ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, వారు పరీక్షలకు అర్హులుకారు. ఎయిమ్స్ ‌వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఎయిమ్స్ ‌రెండు వారాల క్రితం స్వదేశీ వ్యాక్సిన్‌ ‌కోవాక్సిన్‌కు సంబంధించిన హ్యూమన్‌ ‌క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌పక్రియను ప్రారంభించింది. ఇందుకోసం సుమారు 80 మంది వాలంటీర్లను పరీక్షించారు. అయితే వీరిలో 16 మంది మాత్రమే ట్రయల్స్‌కు అనువైన వారిగా తేలింది. ఎయిమ్స్‌లో కోవాక్సిన్‌కు  సంబంధించిన హ్యూమన్‌ ‌ట్రయల్స్‌ను నిశితంగా అధ్యయనం చేసిన ఒక వైద్యునిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 20 శాతం వాలంటీర్ల శరీరంలో కొరోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే ప్రతిరోధకాలను ఇప్పటికే కనుగొన్నామన్నారు. ఒక వ్యక్తిలో యాంటీబాడీ తయారయ్యం దంటే…ఆ వ్యక్తికి అప్పటికే కొరోనా వైరస్‌ ‌సోకి, యాంటీ బాడీస్‌ ‌కారణంగా వైరస్‌ ‌ప్రభావం అంతగా చూపకుండానే
కనుమరుగైవుండవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ వాలంటీర్లలో టీకా ప్రభావాన్ని చూడటం చాలా కష్టమని వారు పేర్కొన్నారు.

సమీప భవిష్యత్‌లో వ్యాక్సిన్‌ అసాధ్యం: డబ్ల్యుహెచ్‌ఓ
‌జెనీవా : కొరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్లీ షాకింగ్‌ ‌కామెంట్స్ ‌చేసింది. కరోనాకు చికిత్స లేకపోవచ్చని తెలిపింది. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్‌ ‌సాధ్యం కాదని.. భవిష్యత్తులోనూ ఉండకపోవచ్చని చెప్పింది. సప భవిష్యత్తులో వ్యాక్సిన్‌ ‌రాదని, రానున్న రోజుల్లో వైరస్‌ ‌ప్రభావం మరింత తీవ్రమవుతుందన్నారు.భౌతికదూరం, మాస్కులు, శానిటౌజర్ల పైనే ప్రజలు దృష్టి పెట్టాలని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో ఇలాంటి హెచ్చరికలు చేయడం వరుసగా ఇది రెండోసారి. గత నెలలో కూడా ఆ సంస్థ డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌టెడ్రోస్‌ అడామ్‌ ‌గిబ్రేయెసస్‌ ‌మాట్లాడుతూ… సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందేనన్నారు.  ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.  రాబోయే కొద్దినెలల్లో వ్యాక్సిన్‌ ‌వస్తుందనుకోవడం అత్యాశే అన్నారాయన. ఇప్పటికే కరోనా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ ‌వస్తుందన్న ఆశలు ఓ వైపు ఉండగా, డబ్ల్యూహెచ్‌వో తాజా వ్యాఖ్యలు మరోవైపు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

160కోట్ల మంది విద్యార్థులపై కొరోనా ప్రభావం: యుఎన్‌ఓ
‌న్యూఢిల్లీ : కొరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై పెను ప్రభావం చూపించినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ ‌వల్ల సుమారు 160 కోట్ల మంది విద్యార్థుల చదువులకు బ్రేక్‌ ‌పడిందన్నారు. మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థతో..దాదాపు 2.5 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్ల నుంచి డ్రాపౌట్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ ‌తెలిపారు. ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ ‌కోవిడ్‌19 అం‌శంపై గుటెరెస్‌ ‌వీడియో సందేశంలో మాట్లాడారు. జూలైలో సుమారు 160 దేశాల్లో స్కూళ్లను బంద్‌ ‌చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో వంద కోట్ల మంది విద్యార్థులు చదువులకు దూరం అయ్యారన్నారు. మరో 4 కోట్ల మంది అత్యంత కీలకమైన ప్రీస్కూల్‌ ఇయర్‌ను కోల్పోయినట్లు ఆయన తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply