Take a fresh look at your lifestyle.

కరోనా వ్యాక్సిన్‌ ‌సంచార వాహనం ప్రారంభం

కోవిడ్‌ ‌టీకా వేసే వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్‌ అనుదీప్‌

‌కొత్తగూడెం,ఆగస్టు 09 (ప్రజాతంత్ర ప్రతినిధి) : కరోనా వ్యాధి నియం త్రణకు వ్యాక్సిన్‌ ‌తీసుకోవడానికి సరైన అవగాహన లేకపోవడంతో పాటు ఆసుపత్రులకు రాలేకపోతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సంచార వాహనం ఏర్పాటు ద్వారా వ్యాక్సిన్‌ ‌వేయు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ‌తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ ‌నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆరద్వర్యంలో సంచార వాహనాలు ద్వారా కోవిడ్‌ ‌టీకా వేసే మొబైల్‌ ‌వాహనాలను కలెక్టర్‌ ‌జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసు పత్రుల్లో కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌ప్రక్రియ జరుగుతున్నదని, మారుమూల ప్రాంతాల నుండి ఆసుపత్రులకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుతున్న ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణలో భాగంగా 11 సంచార వాహనాల ద్వారా వ్యాన్సినేషన్‌ ‌ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు.

జిల్లాలోని ఈ సంచార వాహనాల ద్వారా ప్రతి రోజు దాదాపు 2,200 మందికి వ్యాక్సిన్‌ అం‌దిచనున్నట్లు చెప్పారు. ప్రతి సంచార వాహనంలో సరిపోను వ్యాక్సిన్‌ ‌వాయిల్స్ అం‌దుబాటులో ఉంచుకోవాలని, కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు.  కరోనా నియంత్రణకు తప్పని సరిగా వ్యాక్సిన్‌ ‌తీసుకోవడమేనని, ఎటువంటి భయాందోళనలు అవసరం లేదని నిర్భయంగా 18సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ ‌తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ ‌ప్రక్రియను మారుమూల గ్రామాల ప్రజల చెంతకు తీసుకెళ్లుటలో కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు.ఈ సంచార కోవిడ్‌ ‌టీకా వాహనం ప్రారంభ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ‌శిరీష, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ‌నాగేంద్రప్రసాద్‌, ఉప వైద్యాధికారి డాక్టర్‌ ‌వినోద్‌, ‌ప్రోగ్రాం అధికారి కుమార్‌  ‌పాల్గొన్నారు.

Leave a Reply