Take a fresh look at your lifestyle.

పల్లె ప్రగతి పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్‌ ‌యల్‌.‌శర్మన్‌

నాగర్‌ ‌కర్నూల్‌,‌జులై 30.ప్రజాతంత్రవిలేకరి: గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’కార్యక్రమాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌శర్మన్‌ అధికారులను, సర్పంచులను హెచ్చరించారు. గురువారం కోడేరు, పెద్దకొత్తపల్లి మండలంలోని గ్రామాలలో పల్లె ప్రగతి పను లను జిల్లా కలెక్టర్‌ ‌యల్‌ ‌శర్మన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోడేరు మండలంలో.. కోడేరు, పసుపుల మరియు పెద్దకొత్తపల్లి మండలంలో పెద్దకొత్తపల్లి, ఆదిరాల గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.కోడేరు గ్రామపంచాయతీ కార్యాలయం,బస్టాండ్‌ ‌రోడ్డు మరియు గ్రామంలోని ప్రధాన రోడ్లలో  మురుగుకాలువను పరిశీలించారు.అలాగే కోడేరులోని రైతు వేదిక నిర్మాణాలతో పాటు స్మశాన వాటిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలను పరిశీలించారు. గ్రామంలోని కొందరి ఇళ్ల వద్దకు వెళ్లి  మొక్కలు ఎందుకు నాటుకోలేదని అడిగి తెలుసుకున్నారు.

రోడ్డు విస్తరణలో ఎందుకు జాప్యం జరుగుతోందని తెలుసుకున్నారు.అలాగే ఆర్‌అం‌డ్‌బి ఈఈతో  సెల్‌ఫోన్‌లో ఈ విషయంపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రోడ్లకు ఏక్కడ కూడా మొక్కలు సరిగా లేవని,పారిశుద్ధ్య పరిస్థితులపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు . గ్రామంలో మొక్కలు నాటడం రైతు వేదిక స్మశాన వాటిక పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని సర్పంచ్‌ ‌వెంకటస్వామిని జిల్లా కలెక్టర్‌ ‌ప్రశ్నించారు. వచ్చే నెల 14వ తేదీ తను మళ్ళీ వచ్చేసరికి పనులు పూర్తి అయి ఉండాలని లేకుంటే చర్యలు తీసుకుం టామని కలెక్టర్‌ ‌హెచ్చరించారు.గ్రామంలో ఎక్కడా కూడా ఎవరి ఇంటి ముందర  మొక్కలు లేవని, అసహనం వ్యక్తం చేశారు. మండలంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనుల అభివృద్ధి కార్యక్రమాల నివేదికతో కలెక్టర్‌ ‌కార్యాలయానికి రావాలని కోడేర్‌ ఎం‌పీడీవోను ఆదేశించారు.అనంతరం కోడేరు మండలంలోని పసుపుల గ్రామంలో రైతు వేదిక  డంపింగ్‌ ‌యార్డ్ ‌స్మశాన వాటిక పనులను పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.
పెద్దకొత్తపల్లి మండలంలో…ఆదిరాల గ్రామంలో పల్లె ప్రగతి పనులను పరిశీలిం చారు అదేవిధంగా పెద్దకొత్తపల్లి గ్రామాన్ని పరిశీలించి పల్లె ప్రకృతి వనానికి సంబంధిం చిన స్థలాన్ని పరిశీలించారు.పెద్దకొత్తపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనానికి గ్రామ సర్పం చ్‌ ఆదెర్ల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి చిన్నాన్న ఆదెర్ల నరసింహారెడ్డి తన స్వంత స్థలం 900 గజాలను పల్లె ప్రకృతివనానికి అందించినందుకు కలెక్టర్‌ ‌దాతను అభినందించారు. కలెక్టర్‌ ‌వెంట డిఎల్పిఓ సాంబిరెడ్డి ఉన్నారు.

Leave a Reply

error: Content is protected !!