Take a fresh look at your lifestyle.

గ్రామాలకు పాకుతున్న కొరోనా సునామీ..!

కొరోనా రెండవ అల వ్యాప్తితో గ్రామీణ పేదలు అర్థ ఆకలితో రోజులు గడుపుతూ, దయనీయ పరిస్థితిలో బతుకుతున్నారని విశ్లేషణలు వివరిస్తున్నాయి. ఆకలి కడుపులతో బక్కచిక్కిన గ్రామీణ భారతంపై కొరోనా పంజా విసిరితే దేశ పరిస్థితి ‘పెనెం లోంచ పొయ్యిలో పడినట్లు‘ అవుతుంది. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా కొరోనా కేసులు బయట పడడంతో గ్రామీణులు భయంతో ఉలిక్కి పడుతున్నారు. గ్రామాలు కొరోనా కోరల్లో బంధీలు అయితే వైద్య సదుపాయాలు అరకొరగా కూడా లేనందున మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది.

కొరోనా రెండవ సునామీ తాకిడికి భారతమంతా అట్టుడికి పోతున్నది. కొరోనా కేసులు గత 22 రోజులుగా రోజుకు 3.5 లక్షలు దాటుతూ, కోవిడ్‌-19 ‌మరణాలు 3 – 4 వేలుగా నమోదు అవుతున్నాయి. గత వారం డబ్ల్యూహెచ్‌ఓ ‌నివేదిక ప్రకారం ప్రపంచ కొరోనా కేసుల్లో 50 శాతం మరియు కోవిడ్‌-19 ‌కారణ మరణాల్లో 30 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయని తేలుతోంది. నమోదు కాని కేసులు/మరణాల అంచనాలు ఐదు రెట్లు అధికంగా ఉండవచ్చని అంటున్నారు. ఎటు చూసిన కొరతల అరుపులు, శవాల కుప్పలు దర్శనమిస్తున్నాయి. కొరోనా కేసుల సంఖ్యలో ఆంధ్ర ప్రదేశ్‌ ఐదవ స్థానంలో నిలుస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. ప్రాణవాయువు అందడం లేదు. కోవిడ్‌-19 ఔషధాల నకిలీ కొరతలు ‘రోగుల పుండు మీద కారం’ చల్లుతున్నాయి. మహానగరాల్లోంచి జిల్లా కేంద్రాలను చుట్టేసిన కొరోనా విష తరంగం నేడు మండల స్థాయి మేజర్‌ ‌గ్రామ పంచాయితీలకు పాకింది. నేడు మండల స్థాయి పంచాయితీల నుండి గ్రామాలకు వేగంగా విస్తరిస్తోంది. గ్రామీణ భారతంలో మార్చిలో 21 శాతం నమోదైన కొరోనా కోసులు ఏప్రిల్‌-2021‌లో 30 శాతానికి పెరిగాయని గణాంకాలు తెలుపుతున్నాయి.

కొరోనా రెండవ అల వ్యాప్తితో గ్రామీణ పేదలు అర్థ ఆకలితో రోజులు గడుపుతూ, దయనీయ పరిస్థితిలో బతుకుతున్నారని విశ్లేషణలు వివరిస్తున్నాయి. ఆకలి కడుపులతో బక్కచిక్కిన గ్రామీణ భారతంపై కొరోనా పంజా విసిరితే దేశ పరిస్థితి ‘పెనెం లోంచ పొయ్యిలో పడినట్లు‘ అవుతుంది. ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా కొరోనా కేసులు బయట పడడంతో గ్రామీణులు భయంతో ఉలిక్కి పడుతున్నారు. గ్రామాలు కొరోనా కోరల్లో బంధీలు అయితే వైద్య సదుపాయాలు అరకొరగా కూడా లేనందున మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. దేశానికి వెన్నెముక అయిన రైతు నడ్డి విరిగి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు కుంటుపడతాయి.

కోవిడ్‌-19 ‌వైద్యం పొందలేక కర్షక శ్రామిక లోకం ప్రాణాలు వదలాల్సిన దుస్థితి రాక ముందే ఆపన్నులను ఆదుకోవలసిన కనీక బాధ్యత సర్కారు తీసుకోవాలి. దీనికి గాను కోవిడ్‌-19 ‌సంక్షోభం సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాధాన్యతలను పునర్‌ ‌సమీక్షించుకొని పట్టుదలతో నడవాల్సి ఉంది. త్వరితగతిన టీకా ఉద్యమాన్ని చేపడుతూనే వైద్య ఆరోగ్య వసతులను గ్రామీణ స్థాయి వరకు విస్తరించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో ప్రారంభమై గ్రామపంచాయితీల వరకు కొరోనా సేవలు వికేంద్రీకరించాల్సి ఉంది.

CORONA CASES IN RULAR AREAS

ఇండియాలో దాదాపు వైద్య వసతులు 70 శాతం పట్టణాల్లోనే (30 శాతం జనాభా) కేంద్రీకరించబడి, 70 శాతం గ్రామీణ జనాభాకు అందుబాటులో లేకుండా దూరమైనాయి. గ్రామీణుల్లో కొరోనా పరీక్షలకు 6 – 10 కిమీ దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెల్లడానికి కూడా పల్లె జనం ముందుకు రావడం లేదు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ భయపడి బయట పెట్టడం లేదు. కొరోనా నిర్థారించబడినా తమ వ్యవసాయ పనులు కుంటు పడతాయనే భయంతో ఇంట్లో క్వారంటైన్‌ ‌కావడానికి సిద్ధంగా లేరు. ఈ దుస్థితిలో కొరోనా వ్యాప్తి వేగంగా పెరగడం తప్పనిసరి అయ్యింది. తక్కువ తీవ్రత ఉన్న వారు కొన్ని రోజులకు కోలుకోవచ్చు, కాని కోవిడ్‌-19 ‌తీవ్రత అధికంగా ఉన్న ప్రజలు ఆలస్యంగా ఆసుపత్రులు చేరడం, చివరికి ప్రాణాలు కోల్పోవడం జరుగవచ్చు. రాష్ట్ర జిల్లా స్థాయిలో కొరోనా కేసులను మరియు మరణాల వాస్తవ వివరాలు ప్రకటించాలి.

రాష్ట్ర స్థాయి కేసులు మరియు మరణాల వివరాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్‌, ఔషధాల కోటాను రాష్ట్రాలకు విడుదల చేస్తుందని మరువరాదు. పట్టణ ఆసుపత్రులు మరియు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై కూడా పని భారం అధిక పడుతున్నది. యూపీలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 200 గ్రామాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు.గ్రామ పంచాయితీల వారీగా కొరోనా కేసులను గుర్తించి, వారిని నిత్యం పర్యవేక్షణ చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. కొరోనా పాజిటివ్‌ ‌గ్రామీణులకు అత్యవసర ఔషధాల కిట్లను అందించడంతో పాటు గ్రామపంచాయితీ కార్యాలయంలో ఆక్సీమీటర్లు మరియు థర్మామీటర్లు అందుబాటులో ఉంచాలి. కొరోనా కట్టడికి అంగన్‌ ‌వాడీ మరియు ఆశ వర్కర్ల సేవలను వినియోగించుకొని ఇంటింట సర్వే నిర్వహణ మరియు అనారోగ్యులను గుర్తించడం, వైద్య సేవలు అందించడం రోజు వారీ దినచర్యగా నిర్థేషించాలి.

గ్రామీణ కొరోనా కేసులను తొలి దశలోనే నిర్థారించి, వెంటనే కోవిడ్‌-19 ‌కిట్‌ అం‌దించి, ఇంట్లోనే వైద్యం అందించే ప్రయత్నం చేయాలి. కొరోనా రెండవ అల సునామీ ఉదృతిని తట్టుకొని నిలవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు మరియు గ్రామపంచాయితీలు సమన్వయంతో ఏకతాటిపై నిలిచి, కొరోనా విష కోరల్ని పీకేసి, దేశ అన్నదాతలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, గ్రామీణ భారతాన్ని ఆరోగ్య తోరణాలతో అలంకరిద్దాం.అదృష్ట శత్రువైన మహా మహమ్మారిని మన వైపు చూడకుండా తరిమేద్దాం.

Leave a Reply