Take a fresh look at your lifestyle.

జిల్లా హాస్పిటల్స్ ల్లో అన్ని వసతులతో కొరోనా చికిత్స

  • వైరస్  నియంత్రణకు సమన్వయంతో ముందుకు
  • కోవిడ్‌ ‌నియంత్రణ చర్యలపై మంత్రి  బుగ్గన సమీక్ష

అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్‌ ‌డిపిఆర్సీ  సమావేశ మందిరంలో కోవిడ్‌  ‌వ్యాప్తి నియంత్రణ చర్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్‌  ‌సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. ఎక్కడా బెడ్లు గానీ,అక్సిజన్‌ ‌కొరతగానీ లేదన్నారు. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖమంత్రి మాలగుండ్ల శంకర నారాయణ,ఎమ్మెల్సీలు శమంతక మణి, కత్తి నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసు బాబు, జాయింట్‌ ‌కలెక్టర్‌ (అభివృద్ధి) ఏ.సిరి, అసిస్టెంట్‌ ‌కలెక్టర్‌ ‌సూర్య తేజ , కోవిడ్‌ ‌నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. ఆయా నియోజక వర్గాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సవి•క్షా సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ ‌కాపు రామచంద్రా రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు.
ప్రజారోగ్య పరిరక్షణకు సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులను మంత్రి బుగ్గన సూచించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కరోనా కట్టడికి సిఎం జగన్‌ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని, సమాచారం సేకరించి అధికారులను ఆదేశిస్తున్నారని అన్నారు. ఇదిలావుంటే జిల్లాలో ఇదివరకూ గుర్తించిన 39 ఆస్పత్రులలో కొవిడ్‌ ‌వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ‌గంధం చంద్రుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఆ ఆస్పత్రులకు నోడల్‌ అధికారులను నియమించడంతో పాటు బెడ్లను సైడ్ఫామ్‌ ‌చేసి ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయో డిస్‌ప్లే చేయాలని సూచించారు. హెల్ప్ ‌డెస్క్‌ల ను ఏర్పాటు చేయాలన్నారు.

కొవిడ్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో ఆస్పత్రుల సన్నద్ధత, హోమ్‌ ఐసొ లేషన, అంబులెన్స, కాంటాక్ట్ ‌ట్రేసింగ్‌, ఆక్సిజన లభ్యత తదితర అంశాలపై సవి•క్షించారు. ఆ ఆస్పత్రుల్లో 5420 బెడ్లు వెంటనే సిద్ధం చేయా లన్నారు. కొవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లలో వైద్యాధికారుల బృందం, శానిటేషన, ఆహారం, రెవెన్యూ, పోలీసు తదితర 7 బృం దాలను ఏర్పాటు చేయాలన్నారు. గుర్తించిన ఆస్పత్రుల జాబితా, నోడల్‌ అధికారుల జాబితాను కొవిడ్‌ ‌కేర్‌ ‌సెంట ర్లలో ఉంచాలన్నారు. జిల్లాలో బుధవారం వరకూ 18 ఆస్పత్రులలో 1900 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ప్రస్తుతం చేస్తున్న పరీక్షల సామర్థ్యాన్ని 8 వేలకు పెంచాల్సి ఉందని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో హోమ్‌ఐసొలేషనలో ఉన్న బాధితుల వద్దకు వైద్యులను పంపి వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్ప టికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎనఎం లు, హోమ్‌ ఐసోలేషనలో ఉన్న ప్రతి బాధితుడి ఇంటికెళ్లి కిట్లను అందించాలన్నారు. కొవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని డీ ఎంహెచఓను ఆదేశించారు.

Leave a Reply