Take a fresh look at your lifestyle.

కొరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కోవిడ్‌19 ‌వైరస్‌ ‌వల్ల రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, పేదోళ్లకు కరోన వైద్యం అందక గాంధీ ఆసుపత్రిలో చనిపోతున్నారని,కరోన చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలని,రాష్ట్రంలో కోవిడ్‌ ‌కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ ‌రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్‌ ‌చేశారు. కరోన చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్‌ ‌చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో శక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వినతిపత్రం సమర్పించారు.అనంతరం మంద పవన్‌ ‌మాట్లాడుతూ…రాష్ట్రంలో కరోన వైరస్‌ ‌రోజు రోజుకు వేల సంఖ్యలో పెరిగిపోతున్న,రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉందని అన్నారు. కరోన వైరస్‌ ‌సోకిన ప్రతి ఒక్కరిని గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయాలి. కాని కరోన సోకిన పేదోళ్లకు మాత్రం గాంధి ఆసుపత్రికి పంపిస్తే అక్కడ వైద్యం సరిగా అందక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.మరికొందరు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటున్నారని,అక్కడ వైద్యం చేశాక అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తూ,రోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, దానితో మనోవేదనతో చాలా మంది చనిపోయారని,అందులో ఎక్కువగా జర్నలిస్టులు,పెద్దవాళ్ళు,కార్మికులు ఎక్కువ మంది చనిపోవడం చాలా బాధాకరం అని అన్నారు.ప్రభుత్వ అధికారులకు మరియు మంత్రులకు కరోన సోకితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది వారి ప్రాణాలు రక్షించుకునేందుకు మాత్రమే తాపత్రయ పడుతుందని, కాని మిగితా వారిని గాలికి వదిలేసిందని ప్రభుత్వం పై మండిపడ్డారు.పక్క రాష్ట్రంలో 7 లక్షల కరోన టెస్టులు చేయిస్తే, మన రాష్ట్రంలో మాత్రం 1లక్ష టెస్టు లు పూర్తి చేయలేదని, ఇంతటి పరిస్థితుల్లో కూడ ముఖ్యమంత్రి 15 రోజుల నుంచి ప్రజలు సంక్షేమం మరిచిఉండటం దారుణమని అన్నారు.

రాష్ట్రంలో కరోన టెస్టు లు చేయించి, కరోన సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడం కోసం ఆరోగ్య శ్రీలో చేర్చాలని, రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు.ఈ కార్యక్రమంలో మల్లేష్‌ ,‌మచ్చ శ్రీనివాస్‌, ఎడల వనేశ్‌, అం‌దే అశోక్‌,‌కనుకుంట్ల శంకర్‌, ‌బన్సీలాల్‌, ఈదరి మల్లేశం, కిష్టపురం లక్ష్మణ్‌,ఎనగందుల లక్ష్మి నారాయణ, ఇరి భూమయ్య,సంగెం మధు,నాయకులు సారయ్య, సుదర్శన చారి,ధర్మారెడ్డి, సుధాకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!