Take a fresh look at your lifestyle.

హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌కు కొరోనా

  • గ్రేటర్‌లో పెరుగుతున్న కేసులతో ఆందోళన
  • మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌కు మరోమారు టెస్ట్

‌జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని నగర వాసులను కొరోనా వైరస్‌ ‌వణికిస్తోంది. ఇటీవల జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌ ‌కారు డ్రైవర్‌కు కొరోనా పాజిటివ్‌గా నిర్దారించిన విషయం తెలిసిందే. తాజాగా కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కొరోనా సోకినట్లు నిర్దారణ అయింది. గత మూడు రోజులుగా సూపరింటెండెంట్‌ అధిక జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు పాజిటివ్‌ అని తేలడంతో అదే హాస్పిటల్‌లో ఐసోలేషన్‌కు
వెళ్లిపోయారు. సూపరింటెండెంట్‌తో ఆరోగ్య శాఖ కొరోనా టెస్టులు నిర్వహించనుంది. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. గురువారం మేయర్‌ ‌డ్రైవర్‌ ‌కు  పాజిటివ్‌ ‌వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు జీహెఎంసీ సబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌ ‌కొరోనా పరీక్షలు నిర్వహించగా.. తాజాగా మరోసారి పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. మేయర్‌ ‌డ్రైవర్‌ ‌కు పాజిటివ్‌ ‌రావడంతో శుక్రవారం బొంతు రామ్మోహన్‌ ‌శాంపిల్స్ ‌తీసుకున్నారు డాక్టర్లు. అయితే నాలుగు రోజుల క్రితమే బొంతు రామ్మోహన్‌ ‌కు  పరీక్షలు నిర్వహించగా ఆయనకు నెగటివ్‌ అని తేలింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో  రోజూ 100 నుంచి 175 దాకా కేసులు నమోదవుతుండడంతో అందరిలో ఆందోళన  పెరుగుతోంది. తమ గల్లీలోనో, డివిజన్‌లోనో కొరోనా వచ్చిందని తెలియగానే మరింత ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ ‌కట్టడికి ప్రభుత్వం, బల్దియా నిర్లక్ష్యం, పరిస్థితిని అంచనా వేయకపోవడమే కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,111 కేసులుంటే, గ్రేటర్‌లో 3 వేల పైగా పాజిటివ్‌ ఉం‌డడం తీవ్రతను తెలుపుతోంది. నిర్వహణ కరువై రోజూ హెల్త్ ‌డిపార్ట్ ‌మెంట్‌ ఇచ్చే రిపోర్ట్  ఆధారంగా పాజిటివ్‌ ‌కేసులున్న చోట జీహెచ్‌ఎం‌సీ కంటెయిన్‌మెంట్‌ ‌జోన్లు ఏర్పాటు చేసి నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉంది. కానీ చాలా ఏరియాల్లో అలాంటి చర్యలే వీ తీసుకోవడం లేదు. ఏ జోన్‌లో ఎన్ని కంటెయిన్‌మెంట్లు ఉన్నాయో కూడా అధికారులు చెప్పడం లేదు. క్షేత్రస్థాయిలో నిర్వహణ సక్రమంగా లేకపోవడమే అందుక్కారణంగా తెలుస్తోంది. అర్‌పేట్‌ ‌కు చెందిన వ్యక్తికి 4రోజుల కిందట పాజిటివ్‌ ‌వస్తే ఆయన ఇంటిని కంటెయిన్‌మెంట్‌ ‌చేయలేదు. టెస్టులు చేసేందుకు ఎవరూ రాలేదు. కొరోనాకు కేరాఫ్‌ ‌గా మారిన జియాగూడలో 5 రోజుల కిందట ఒకరు కొరోనాతో చనిపోగా, ఆ ఫ్యామిలీ మెంబర్‌కు టెస్ట్ ‌లు చేయలేదు. ఇంట్లోవాళ్లు మామూలుగానే బయటకు వచ్చిపోతున్నారు. స్థానికంగా డిస్‌ ఇన్‌ ‌ఫెక్టీవ్‌  ‌కూడా చేయకపోవడం వల్లస్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కే సులు పెరుగుతుంటే జీహెచ్‌ఎం‌సీకి నిర్లక్ష్యంగా ఉండడం తగదంటున్నారు. కాల్‌ ‌సెంటర్‌కు ఫోన్‌ ‌చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైమరీ కాంటాక్టస్ ‌టెస్ట్‌లు చేయడం లేదు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!