తెలంగాణ సరిహద్దున ఉన్న ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలో దండకారణ్యంలో ఉన్న మహిళా మావోయిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్ఘఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ముదుకపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేహకావలి దండకారణ్యంలో ఉన్న సుమిత్ర అనే మహిళ మావోయిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు బీజాపూర్ జిల్లాలోని డిస్టిక్ రిజర్వ్ గార్డస్ పోలీస్ బలగాలకు చత్తీస్ఘఢ్ మావోయిస్టు దండకారణ్య కమిటి ఒక లేఖను ఫోటోలను పంపినట్లు సమాచారం. ఆ మహిళ దగ్గు, జ్వరం, జలుబుతో తీవ్రంగా బాధ పడుతున్నట్లు తెలుస్తుంది.