Take a fresh look at your lifestyle.

రాహుల్‌ ‌గాంధీ సహా పలువురు ప్రముఖులకు కొరోనా

  • కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌, ‌సిఇసి సుశీచంద్ర, ఇసి రాజీవ్‌కుమార్‌లకు పాజిటివ్‌
  • ‌హోమ్‌ ఐసోలేషన్‌లో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌

దేశంలో కొరోనా విజృంభిస్తున్న వేళ సామాన్యులేగాక పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు కూడా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఎంపీ రాహుల్‌ ‌గాంధీ కొరోనా వైరస్‌ ‌బాకినపడ్డారు కోవిడ్‌ ‌పరీక్షలో ఆయన పాజిటివ్‌గా తేల్చారు. స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉన్నట్లు రాహుల్‌ ‌తన ట్విట్టర్‌లో తెలిపారు. అయితే కోవిడ్‌ ‌పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా వొచ్చినట్లు ఆయన చెప్పారు. తనతో ఇటీవల కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లు అంతా కోవిడ్‌ ‌ప్రోటోకాల్‌ ‌ప్రకారం పరీక్షలు చేయించుకోవాలని రాహుల్‌ ‌కోరారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. అయితే బెంగాల్‌లో జరగాల్సిన చివరి మూడు దశల ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఇక  కేంద్ర ప్రభుత్వంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌కు కొరోనా పాజిటివ్‌ ‌నమోదయింది.

ఈ విషయాన్ని జితేంద్రసింగ్‌ ‌వి•డియాకు వెల్లడించారు. చీఫ్‌ ఎలక్షన్‌ ‌కమిషనర్‌ ‌సుశీల్‌ ‌చంద్ర కూడా వైరస్‌ ‌బారినపడ్డారు. అలాగే ఎన్నికల కమిషనర్‌ ‌రాజీవ్‌కుమార్‌కు సైతం వైరస్‌ ‌పాజిటివ్‌గా నమోదయింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రివాల్‌ ‌సెల్ఫ్ ‌క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. కేజ్రివాల్‌ ‌భార్య సునీత కేజ్రివాల్‌కు కొరోనా పాజిటివ్‌ ‌రావడంతో ఆమెతోపాటు ఆయన కూడా హోమ్‌ ‌క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని వారు వి•డియాకు వెల్లడించారు. జిల్లా కోర్టు జడ్జి కోవై వేణుగోపాల్‌ ‌కోవిడ్‌తో ఢిల్లీలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ సోమవారంనాడు కన్నుమూశారు.

Leave a Reply