Take a fresh look at your lifestyle.

కొరోనా పరీక్షలు, వైద్య చికిత్సలపై .. హైకోర్టు సంతృప్తి

అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయాలని కోర్టుకు లేదని వ్యాఖ్య
రసుల్‌పూర హాకీ మైదానంలో ఐసోలేషన్‌ ‌సెంటర్‌ ఏర్పాటుకు ఆదేశం

తెలంగాణలో కొరోనా పరీక్షలు, వైద్య చికిత్సపై హైకోర్టు సంతృప్తి వ్యక్త చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలే అవలంభిస్తున్నదని వ్యాఖ్యానించింది. అయితే, కొరోనా వైద్య చికిత్సల పేరుతో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో కొరోనా పరీక్షలు, బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలు, అందిస్తున్న చికిత్సలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. హోటళ్లలో ఐసోలేషన్‌ ‌పడకల సంఖ్య 857 నుంచి 2995 వరకు పెరిగిందనీ, ప్రభుత్వ దవాఖానాలలో కొరోనా బాధితులను చేర్చుకునే ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొన్నారు.. ప్రవేటు దవాఖానాలపై 50 ఫిర్యాదులు రాగా, 46 దవాఖానాలకు నోటీసులు జారీ చేశామనీ, వాటిలో 16 యాజమాన్యాలు ఇప్పటికే వివరణ ఇచ్చాయని తెలిపారు. అలాగే, హైకోర్టు ఆదేశాల మేరకు మీడియా బులెటిన్‌లో సైతం ఎలాంటి గందరగోళం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ర్యాపిడ్‌ ‌యాంటిజెన్‌ ‌పరీక్షలు వ్యాధి నిర్ధారణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనీ, భవిష్యత్తులో రాష్ట్రంలో రోజుకు 40 వేల టెస్టులు జరిపేందుకు ప్రణాళిక నిర్వహిస్తున్నట్లు సీఎస్‌ ‌హైకోర్టుకు వివరించారు. జీహెచ్‌ఎం‌లో కొరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నదనీ, ప్రభుత్వ దవాఖానాలన్నింటిలో ఆక్సీజన్‌ ‌సదుపాయం కల్పించామన్నారు. కొరోనా నియంత్రణకు వైద్య సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారనీ, హైకోర్టు సూచన మేరకు కొరోనా బులెటిన్‌ను తెలుగులో కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. కాగా, కొరోనా పరీక్షలు, చికిత్సలపై సీఎస్‌ ఇచ్చిన వివరణతో హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళుతున్నదని వ్యాఖ్యానించింది. అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయాలనేది తమ ఉద్దేశ్యం కాదనీ, చిన్న చిన్న లోపాలను సరిదిద్దాలనేదే తమ ప్రయత్నమని స్పష్టం చేసింది. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చి దిద్దాలన్నది తమ ప్రయత్నమనీ, ఇప్పుడు సుమారు 90 శాతం పర్ఫెక్షన్‌ ‌వచ్చిందనీ, రానున్న రోజుల్లో దీనిని కొనసాగించాలని స్పష్టం చేసింది.  కొరోనా చికిత్సల విషయంలో ప్రైవేటు హాస్పిటల్స్ ‌ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాయా? లేదా ? పేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించాయా ? లేదా ?అన్నది పరిశీలించాలనీ, నిబంధనలు ఉల్లంఘించిన దవాఖానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఢిల్లీ తరహాలో ప్రైవేటు దవాఖానాలలో కొరోనా బాధితులకు ప్రత్యేకంగా పడకలు కేటాయించాలనీ, ప్రభుత్వానికి వీలు కాకపోతే కారణాలు తెలపాలని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 4‌కు వాయిదా వేస్తూ ఆ విచారణకు సీఎస్‌ ‌హాజరు కావాల్సిన అవసరం లేదనీ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌, ‌డీఎంఈ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!