Take a fresh look at your lifestyle.

తెలంగాణలో 18 ప్రైవేటు ల్యాబ్‌ల్లో టెస్టులు

తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్‌లకు కొరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్‌  అనుమతిచ్చింది. దీంతో గత 15 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ప్రైవేటు ల్యాబ్‌ల కొరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి.. లోపాలను గుర్తించింది. 48 గంటల్లో లోపాలను సవరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకున్నాయి.

ఈ నేపథ్యంలో… కొరోనా శాంపిల్స్ ‌సేకరించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు డిజ్‌ ఇన్‌ఫెక్షన్‌ ‌కోసం నాలుగు రోజుల పాటు స్వచ్ఛందంగా వైరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ల్యాబ్‌లు ప్రకటించాయి. ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది శాంపిల్స్ ‌సేకరించి పంపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాయి. నేరుగా ల్యాబ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకేనే అనుమానితుల శాంపిల్స్ ‌మాత్రం సేకరించబోమని స్పష్టం చేశాయి. ఈనెల 6 నుంచి తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించాయి.

Leave a Reply

error: Content is protected !!