Take a fresh look at your lifestyle.

ఏపీలో ఇక పది నిముషాల్లోనే కొరోనా టెస్ట్

  • దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక కిట్లు రాక
  • లాంఛనంగా ప్రారం భించిన
  • సిఎం వైఎస్‌ ‌జగన్‌
  • ‌త్వరలోనే జిల్లాలకు పంపిస్తామని వెల్లడి

అమరావతి,ఏప్రిల్‌ 17 : ‌వేగవంతమైన కరోనా నిర్దారణ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్‌కు లక్ష కోవిడ్‌ ‌ర్యాపిడ్‌ ‌కిట్లను తీసుకొచ్చారు. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్‌ ‌విమానంలో ఈ కిట్లను ఏపీకి తరలించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఈ టెస్ట్ ‌కిట్లను ప్రారంభించారు. ఈ ర్యాపిడ్‌ ‌కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తించవచ్చు. కొత్తగా లక్ష ర్యాపిట్‌ ‌కిట్లు రావడంతో ఆంధ్రప్రదేశ్‌ ‌కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్‌ఫెక్షన్‌ ఉం‌దా లేదా నిర్దారించడమే కాకుండా.. ఇన్‌ఫెక్షన్‌ ‌వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తిస్తున్నాయి.

కమ్యూనిటీ టెస్టింగ్‌ ‌కోసం ర్యాపిడ్‌ ‌కిట్లను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నట్టు చెప్పారు. మరోవైపు కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా పరీక్షలు నిర్వహణలో ఏపీ దేశంలో టాప్‌-5‌లో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ డా. కేఎస్‌ ‌జవహర్‌రెడ్డి అన్నారు.కాగా, ఏపీలో ఇప్పటివరకు 572 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ‌నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ ‌సవాంగ్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply