Take a fresh look at your lifestyle.

భయపడితే కొరోనా కబళిస్తున్నది

  • వరంగల్‌లో త్వరలో అధునాతన హాస్పిటల్‌
  • ‌వరంగల్‌ అభివృద్ధి టిఆర్‌ఎస్‌కే సాధ్యమన్న ఈటల
  • వోట్ల కోసం బిజెపి నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలన్న వినోద్‌

భయపడితే కొరోనా కబళిస్తుందని..అందుకే స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి ఈటల రాజేందర్‌ ‌సూచించారు. సోమవారం జవహార్‌ ‌నగర్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి మాట్లాడుతూ వరంగల్‌లో త్వరలో అధునాతన హాస్పిటల్‌ ‌నిర్మిస్తామని తెలిపారు. వరంగల్‌ ‌నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని చెప్పారు. కుల, మతం కాకుండా అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు. బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి వోట్లు పొందాలని చూస్తున్నారని.. వరంగల్‌ ‌ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ ‌సూచించారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఆయన సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌తో కలిసి గ్రేటర్‌ ‌వరంగల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయో చూపించాలన్నారు. పేదింటి ఆడబిడ్డల పాలిట మేనమామలా ఆదుకుంటున్న మహానుభావుడు కేసీఆర్‌ అని అన్నారు. ఆరునెలల్లో కాకతీయ టెక్స్‌టైల్‌ ‌పార్కులో ఉద్యోగాలు కల్పిస్తామని హావి• ఇచ్చారు. అదే ఆరునెలల్లో కోచ్‌ ‌ఫ్యాక్టరీ నిర్మాణం మొదలు పెట్టకపోతే బీజేపీ నేతలు ముక్కు నేలకు రాయాలని హెచ్చరించారు. బీజేపీ నేతలు వోట్ల కోసం వొస్తే గ్యాస్‌ ‌సిలెండర్‌ ‌ముందు పెట్టి బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో బీజేపీ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంటింటీకి తాగునీరు ఇచ్చారా..? అని నిలదీశారు. గోదావరి జలాలతో గొంతుతడి అర్పిన మహానుభావుడు కేసీఆర్‌ అని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతునివ్వాలని, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Leave a Reply