Take a fresh look at your lifestyle.

గాంధీ ఆసుపత్రికి కొరోనా అనుమానితుల తాకిడి

  • గురువారం ఒక్కరోజే 163 మంది వైద్య పరీక్షలకు
  • మర్కజీ యాత్రికులపై ప్రభుత్వం నజర్‌
  • ‌రాష్ట్రవ్యాప్తంగా జూడాల నిరసన
  • రక్షణ కల్పిస్తేనే విధులు నిర్వర్తిస్తామని స్పష్టీకరణ
  • గాంధీ వైద్యులతో డీఎంఈ సమావేశం

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ ‌కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం పట్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 127 పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు, వైరస్‌ ‌కారణంగా 9 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. గురువారం ఒక్కరోజే కొరోనా అనుమానిత లక్షణా)తో గాంధీ ఆసుపత్రికి 163 మందికి పైగా వచ్చారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. మరో 70 మంది కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి వైద్య చికిత్సలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, దిల్లీ మర్కజీకి వెళ్లి వచ్చిన వారందరికీ పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మర్కజీకి రాష్ట్రం నుంచి 1000 మందికి పైగా వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో దాదాపు 650 మందికి పైగా హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌తదితర ప్రాంతాల నుంచి హాజరైనట్లు అధికారులు గుర్తించారు. వీరిలో అధికశాతం గాంధీ ఆసపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. వీరిలో దాదాపు 160 మంది జాడ ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో అసలు వారంతా ఎక్కడ ఉన్నారు. వారు ఎవరితో ఉంటున్నారు. వారి ద్వారా ఎంత మందికి వైరస్‌ ‌వ్యాప్తి చెందే అవకాశం ఉందనే విషయాలపై వైద్య ఆరోగ్య శాక అధికారులు దృష్టి సారించారు. మరోవైపు, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన రోగులు వైద్యానికి సహకరించడం లేదని సమాచారం.

గాంధీ ఆసపత్రిలోనే సామూహికంగా ప్రార్థనలు నిర్వహించడం, ఒకే చోట కూర్చుని భోజనం చేయడం, ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ‌వేసుకోకుండా ఆసుపత్రిలో సంచరిస్తుండటం వైద్యులకు తలనొప్పిగా మారింది. ఇదే విషయాన్ని వైద్యులు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌డా.శ్రవణ్‌కుమార్‌ ‌దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి వైద్యం అందిస్తున్నారు.కాగా, సికింద్రాబాద్‌ ‌బౌద్ధనగర్‌ ‌ప్రాంతంలో మర్కజీకి వెళ్లి వచ్చిన వారు సంచరిస్తున్నట్లు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పోలీసులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిలో ఒకరిని మాత్రం పోలీసులు పట్టుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, కరోనా సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రోగి బంధువులు వైద్యులపై దాడి చేసిన ఘటనపై గురువారం జూడాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రితో పాటు, ఉస్మానియా, ఫీవర్‌, ‌చెస్ట్, ‌వరంగల్‌ ఎం‌జిఎం ఆసుపత్రులలో జూడాలు తమకు రక్షణ కల్పిస్తేనే విధులు నిర్వహిస్తామనీ లేదంటే విధులు బహిష్కరించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

గాంధీ ఆసుపత్రిలో బుధవారం రాత్రి కరోనా రోగి మృతి చెందడంతో అతని తరఫు బంధువులు వైద్యులపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం ఆయా ఆసుపత్రులకు చేరుకుని నిరసన తెలిపారు. దీంతో డీఎంఈ డాక్టర్‌ ‌రమేశ్‌ ‌రెడ్డి గాంధీ ఆసుపత్రికి చేరుకుని జూడాలతో చర్చలు జరిపారు. జూడాలకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందనీ, వారి రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ‌సైతం గాంధీ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్‌ అం‌జనీకుమార్‌ ‌గాంధీ ఆసుపత్రికి వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గాంధీ ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను మాత్రమే ఆసుపత్రిలోనికి వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy