Take a fresh look at your lifestyle.

రోజురోజుకూ పెరుగుతోన్న కొరోనా బాధితులు

  • ఎపిలో కొత్తగా 31 కరోనా కేసులు నమోదు

ఆం‌ధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ‌విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31 కొత్త కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కృష్ణా జిల్లాలో 18, కర్నూల్‌లో 5, నెల్లూరులో 3, తూర్పుగోదావరిలో 2, ప్రకాశంలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు చొప్పున నమోదు అయ్యాయి. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 603కు చేరింది. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా, కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జి అయ్యారు. ఆంధప్రదేశ్‌లో కొత్తగా మరో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 603కు చేరుకుంది.

ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో 31 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఒక కృష్ణా జిల్లాలోనే 18 కొత్త కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార బృందం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 42 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ ‌కాగా 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 546 యాక్టీవ్‌ ‌కేసులు ఉన్నాయి. కర్నూలు(129), గుంటూరు(126) జిలాల్లో అత్యధికంగా కోవిడ్‌-19 ‌కేసులు నమోదయ్యాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!