Take a fresh look at your lifestyle.

దేశంలో మళ్లీ కొరోనా కలకలం

  • తాజాగా మళ్లీ పెరిగిన కొత్త కేసులు…మరణాలు
  • రాష్ట్రంలో ఇద్దరిలో కొత్త వేరియంట్‌ ‌లక్షణాలు
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు
  • కర్నాటకలోనూ కోవిడ్‌ ‌కొత్త వేరియంట్‌
  • అ‌ప్రమత్తమయిన రాష్ట్ర ప్రభుత్వం…విదేశీయుల రాకపై మరోమారు ఆంక్షలు
  • రెండు డోసుల టీకా తీసుకున్నా మహారాష్ట్ర మంత్రి పాటిల్‌కు రెండోసారి పాజిటివ్‌
  • ‌థర్డ్ ‌వేవ్‌పై ముప్పుపై ప్రజల్లో భయాందోళన

కొరోనా మహమ్మారి థర్డ్ ‌వేవ్‌ ‌ముప్పు భయపెడుతుంది. ఇప్పటికే రష్యా, బ్రిటన్‌, ‌చైనా లాంటి పలు దేశాల్లో మరోసారి కోవిడ్‌  ‌ప్రకంపనలు రేపుతుంది. ఇక మన దేశంలో కొరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 16,156 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, వైరస్‌తో 733 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,42,31,809 వరకు కొరోనా కేసులు నమోదు కాగా, మొత్తం 4,56,386 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,60,989 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా, 3,36,14,434 మంది రికవరీ అయినట్లు గురువారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ ‌బులిటెన్‌ ‌వెల్లడించింది.

ఇక తెలంగాణలో కొరోనా డెల్టా ఏవై.4.2 వేరియంట్‌ ‌కలకలం రేపుతుంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా 42 కొత్త వ్యారియెంట్‌ ‌కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. రాష్ట్రంలో 48 ఏళ్ల వ్యక్తికి, 22 ఏళ్ల యువతికి ఏవై 4.2 నిర్దారణ అయింది. కొత్త వేరియంట్‌పై వైద్యాధికారులు గోప్యత పాటిస్తున్నారు. కర్ణాటక, ఆంధప్రదేశ్‌ ‌సహా పలు రాష్ట్రాల్లోనూ వైరస్‌ ‌విస్తరిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత డెల్టా వెరియెంట్‌తో పోలిస్తే 15 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందరూ టీకా తీసుకొని ఇప్పడిప్పుడే తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ లోపే ఈ వార్త కాస్త ఆందోళనకరంగా మారింది. ఇటీవల బ్రిటన్‌లో కొరోనా ఉధృతికి కారణమైన ’ఏవై.4.2’ వేరియంట్‌ ‌కేసులు అటు కర్ణాటకలో ఇటు రాష్ట్రంలోనూ కనిపిస్తున్నాయి. జీనోమ్‌ ‌సీక్వెన్సింగ్‌లో ఇద్దరిలో ఈ తరహా వైరస్‌ ‌కనిపించినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని గ్లోబల్‌ ఇన్షియేటివ్‌ ఇన్‌ ‌షేరింగ్‌ ఆఫ్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా(జీఐఎస్‌ఏఐడీ) వెల్లడించింది.

ఈ వేరియంట్‌కు గురైన వారిలో ప్రపంచవ్యాప్తంగా 26 వేల మంది ఉన్నారు. ఈ వేరియంట్‌ ‌కారణంగానే మనదేశంలో మూడో వేవ్‌ ‌కొరోనా వొచ్చే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిమ్స్ ‌నుంచి జీనోమ్‌ ‌సీక్వెన్సింగ్‌కు వొచ్చిన నమూనాల్లో ఈ మేరకు వేరియంట్‌ ‌గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్రంలో గత నెలలో నమోదైన 274 మంది కొరోనా కేసుల్లో వాటి రక్త నమూనాలను హైదరాబాద్‌లోని సెంటర్‌ ఆఫ్‌ ‌డీఎన్‌ఏ ‌ఫింగర్‌ ‌ప్రింటింగ్‌ ‌లేబరేటరీలో జీనోమ్‌ ‌సీక్వెన్సింగ్‌కు పంపించారు. అందులో ఇద్దరి నమూనాల్లో ‘ఏవై.4.2’ కొరోనా వేరియంట్‌ ‌గుర్తించినట్లు వెల్లడించారు వైద్యశాఖ అధికారులు. కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌రావడానికి ముఖ్య కారణంగా చెప్పుకునే డెల్టా వేరియంట్‌ ‌ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వివిధ రకాల స్ట్రెయిన్లు కూడా గర్తించపడ్డాయి. ఇలా గుర్తించబడిన వాటిలో 67 రకాల స్ట్రెయిన్లు ఉన్నాయి. అందులో ‘ఏవై.4.2’రకం ఒకటి. దీనిలో రెండు అదనపు మ్యుటేషన్లు కూడా ఉన్నాయి. ఏ222వీ, వై145హెచ్‌ అనే ఈ మ్యుటేషన్లు ఉండటమే దీనికి, డెల్టా వేరియంట్‌కు ప్రధానమైన తేడా. ఈ ఏవై.4.2 డెల్టా వేరియంట్‌ ‌వైరస్‌తో పోలిస్తే, 12.4 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మరణించే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్నాయని యూకే చెబుతుండగా, డబ్ల్యూహెచ్‌ఓ ‌మాత్రం కేసులు పెరుగుతున్నాయే కానీ, మరణాలు పెద్దగా లేవని చెబుతుండటం కొంత ఊరటనిస్తుంది. అయితే దీనిని మొదట మనదేశంలో జూలైలోనే గుర్తించినట్లు నిపుణులు చెబుతున్నారు.

కానీ పెద్దగా వ్యాప్తి చెందకపోవడంతో వెలుగులోకి రాలేదన్నారు. రాష్ట్రంలో ఆ వేరియంట్‌ ‌కేసులు పెరిగే అవకాశం ఉండొచ్చనేది చర్చనీయాశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కూడా కొరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. టీకా ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని..నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.

కర్నాటకలోనూ కోవిడ్‌ ‌కొత్త వేరియంట్‌…అ‌ప్రమత్తమయిన రాష్ట్ర ప్రభుత్వం…విదేశీయుల రాకపై మరోమారు ఆంక్షలు
డెల్టాకు సంబంధించిన కొత్త వేరియంట్‌ ఏవై 4.2 ఉనికి పలు రాష్ట్రాల్లో  కనిపించడం కలకలం సృష్టిసున్నది. ఈ క్రమంలో కర్నాకట మరోమారు అప్రమత్తం అయ్యింది. కోవిడ్‌ ‌వైరస్‌ ‌కొత్తరూపం దాల్చిందని ఎవై 4.2 రూపంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందని బీబీఎపీ కమిషనర్‌ ‌గౌరవ్‌ ‌గుప్తా వెల్లడించారు. రూపాంతరం చెందిన ఈ కొత్త వైరస్‌ ‌నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బెంగళూరులో ముగ్గురు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడుగురిలో ఈ కొత్త తరహా వైరస్‌ ‌లక్షణాలు కనిపించాయన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త వైరస్‌ ‌వదంతుల నేపథ్యంలో నగర ప్రజల్లో జాగృతి రేకెత్తిందుకు బీబీఎంపీ తరుపున మార్షల్స్‌ను రంగంలోకి దింపుతున్నామన్నారు.

ప్రజలు భౌతిక దూర పాటించేలా వీరు జాగృతి చేపడతారన్నారు. ముందుజాగ్రత్తగా మాస్కులు ధరించాలని ఆయన ప్రజలను కోరారు. ఇదే క్రమంలో కొన్ని దేశాల నుంచి ప్రజల రాకపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కోవిడ్‌ ‌కేసులు అధికంగా ఉన్న బ్రిటన్‌, ‌చైనా, బంగ్లాదేశ్‌ ‌తదితర తొమ్మిది దేశాల నుంచి కర్ణాటకలోకి ప్రవేశించేవారు తప్పనిసరిగా కోవిడ్‌ ‌నెగిటివ్‌ ‌నివేదిక చూపించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్‌ ‌కే సుధాకర్‌ ‌చెప్పారు. కోవిడ్‌ ‌సాంకేతిక సలహా కమిటీ సూచన మేరకు ఈ ఆదేశాలను తక్షణం అమలులోకి తెచ్చామన్నారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న తొమ్మిది దేశాలకు చెందిన ప్రయాణీకులు కోవిడ్‌ ‌నెగిటివ్‌ ‌పరీక్షల నివేదిక వెంటతెచ్చుకోకపోతే క్వారెంటైన్‌కు వెళ్ళాల్సి వుంటుందన్నారు. బ్రిటన్‌, ‌దక్షణాఫ్రికా, బ్రెజిల్‌, ‌బంగ్లాదేశ్‌, ‌బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, ‌న్యూజిల్యాండ్‌ ‌దేశాల నుంచి వొచ్చేవారికి ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు.

నెగిటివ్‌ ‌నివేదిక చూపకపోతే విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహించి ఏడు రోజుల క్వారెంటైన్‌కు పంపడం జరుగుతుందన్నారు. 72 గంటల అవధి మించని ఆర్‌టీపీసీఆర్‌ ‌నివేదికలను ప్రయాణీకులు విమానాశ్రయంలోనే అధికారులకు చూపించాల్సివుంటుందన్నారు. రెండు టీకాలను వేయించుకున్న ప్రయాణీకులు సైతం ఈ నబంధనలు పాటించాల్సివుంటుందన్నారు. ముందు జాగ్రత్తగా కర్ణాటక ఆరోగ్య శాఖ విదేశాల నుంచి ప్రతి ప్రయాణీకుడి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక నిఘా విధిస్తుందన్నారు.

రెండు డోసుల టీకా తీసుకున్నా మహారాష్ట్ర మంత్రి పాటిల్‌కు రెండోసారి పాజిటివ్‌
‌మహారాష్ట్ర హోమ్‌ ‌మంత్రి దిలీప్‌ ‌వాల్సే పాటిల్‌ ఏడాది వ్యవధిలో రెండోసారి కొరోనా బారినపడ్డారు. పాటిల్‌కు బుధవారం కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌నిర్దారణ అయింది. ఆయన రెండు మోతాదుల టీకా కూడా తీసుకున్నారు. గత ఏడాది అక్టోబరులో పాటిల్‌కు కొరోనా నిర్ణారణ అయింది. తాజాగా ఆయన స్వల్ప కొరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకోవడంతో తనకు పాజిటివ్‌ ‌వొచ్చిందని ఆయన పాటిల్‌ ‌సోషల్‌ ‌వి•డియాలో ప్రకటించారు. నాగపూర్‌, అమరావతి పర్యటనల్లో భాగంగా, ఇతర కార్యక్రమాల్లో తనతోపాటు పాల్గొన్న వారు  పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ పాటిల్‌  ‌గురువారం ఉదయం ట్వీట్‌ ‌చేశారు.

Leave a Reply