Take a fresh look at your lifestyle.

దేశంలో కోరలు చాస్తున్న కొరోనా సెకండ్‌ ‌వేవ్‌

  • 4 ‌గంటల్లో 1,26,789 కొత్త కేసులు..685 మరణాలు
  • సెకండ్‌వేవ్‌లో చిన్నారులపైనా మహమ్మారి ప్రతాపం
  • ఫస్ట్ ‌వేవ్‌కు భిన్నంగా కొరోనా సెకండ్‌వేవ్‌ ‌లక్షణాలు: నిపుణులు

దేశ వ్యాప్తంగా కొరోనా వైరస్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌కోరలు చాస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. రోజు వారీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో పాటు మరణాల సంఖ్య కూడా ఆందోళన కటిగిస్తున్నది. 24 గంటల్లో దేశంలో 1,26,789 కోవిడ్‌ ‌కేసులు, 685 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 1,29,28,574కు పెరగ్గా.. మృతుల సంఖ్య 1,66,862కు చేరింది. కొత్తగా 59,258 మంది డిశ్చార్జి అవగా.. 1,18,51,393 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 9,10,319కు చేరాయి. మరో వైపు టీకా డ్రైవ్‌ ‌దేశంలో ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,01,98,673 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. మరో వైపు బుధవారం 12,37,781 కోవిడ్‌ ‌టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ ‌తెలిపింది. పరిస్థితి ఎక్కడ చేయిదాటి పోతుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గత సంవత్సరమే లాక్‌ ‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్రస్తుత పరిణామాలతో బెంబేతెద్దుతున్నారు.

సెకండ్‌వేవ్‌లో చిన్నారులపైనా మహమ్మారి ప్రతాపం
దేశంలో గతంలో వయోజనులపై ప్రభావం చూపిన కొరోనా మహమ్మారి ఇప్పుడు సెకండ్‌ ‌వేవ్‌లో చిన్నారులపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. నెల రోజుల్లోనే కేవలం ఐదు రాష్ట్రాల్లో 79,688 మంది చిన్నారులు కోవిడ్‌ ‌బారిన పడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పెద్దలకు టీకా వొచ్చినప్పటికీ…ఇప్పటికైతే చిన్న పిల్లలకు టీకా అందుబాటులోకి రాలేదు. ఆస్ట్రాజెనికా టీకాను బ్రిటన్‌లో చిన్నారులపై పరీక్షలు జరిపినప్పటికీ… రక్తం గడ్డ కట్టడంతో పాటు, ఏడుగురు మరణించిన నేపథ్యంలో నిలుపుదల చేసారు. 2021, మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 4‌వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ట్రలోనే 60,684 మంది చిన్నారులకు కొరోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9,882 మంది ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.

ఛత్తీస్‌గఢ్‌లో 5,940 మంది పిల్లలు కోవిడ్‌ ‌బారిన పడగా..922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. కర్ణాటకలో 7,327 మందికి సోకగా..ఐదేళ్ల లోపు చిన్నారులు 871, ఉత్తరప్రదేశ్‌లో 3,004 మంది వైరస్‌ ‌బాధితులుండగా…ఐదేళ్ల లోపు చిన్నారులు 471 మంది పిల్లలకు కొరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయింది. అయితే దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా హాస్పిటల్‌ ‌వైద్యులు తెలిపారు. ఢిల్లీలో 2,733 మంది పిల్లలకు కొరోనా సోకగా… ఐదేళ్ల లోపు చిన్నారులు 441 మంది ఉన్నారు. పిల్లల రోగ నిరోధక శక్తి బలహీన పటడం వల్ల ఇలా కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫస్ట్ ‌వేవ్‌కు భిన్నంగా కొరోనా సెకండ్‌వేవ్‌ ‌లక్షణాలు : నిపుణులు
కొరోనా సెకండ్‌ ‌వేవ్‌లో లక్షణాలు ఫస్ట్ ‌వేవ్‌కు భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ ‌వేవ్‌లో జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, శ్వాస సమస్య, వాసన, రుచి తెలియకుండా పోవడం వంటి లక్షణాలుంటే సెకండ్‌ ‌వేవ్‌లో కొరోనా సోకినవారిలో జీర్ణాశయ సమస్యలు, పొత్తి కడుపులో నొప్పి, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు వంటి కొత్త లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీర్ణవ్యవస్థలో భారీగా ఉండే ఏసీఈ2 గ్రాహకాలకు అతుక్కుని వైరస్‌ ‌తన ఉధృతిని పెంచుకుంటుందని నిపుణులు తెలిపారు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే టెస్టు చేయించుకోవాలని వారు సూచించారు. కాగా, ఈ లక్షణాలు కనిపించిన వారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు లేకపోవడాన్ని నిపుణులు గమనించారు. అటు.. చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం ఆందోళన కలిగించే అంశం.

Leave a Reply