Take a fresh look at your lifestyle.

కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌ప్రభావం

భారీగా నష్టపోయిన స్టాక్‌ ‌మార్కెట్లు
‌కరోనా రెండో దశ ఉద్ధృతి దేశీయ స్టాక్‌ ‌మార్కెట్లను ముంచేసింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఏకంగా 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. 48,956 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ 1707 ‌పాయింట్లు కోల్పోయి 47,883 వద్ద రోజును ముగించింది. ఇక, 14,644 వద్ద రోజును ప్రారంభించిన నిప్టీ 524 పాయింట్లు కోల్పోయి 14,310 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.రెడ్డీస్‌ ‌ల్యాబ్స్, ‌సిఎ•-లా, దివీస్‌ ‌ల్యాబ్స్, ‌బ్రిటానియా లాభాలను ఆర్జించగా.. టాటా మోటార్స్, అదానీ పోర్టస్, ఇం‌డస్‌ ఇం‌డ్‌ ‌బ్యాంక్‌, ‌బజాజ్‌గ్•నాన్స్ ‌నష్టాలను చవిచూశాయి. దాదాపు రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ ‌క్యాపిటలైజేషన్‌ 6,86,708.74 ‌కోట్ల రూపాయల నుంచి 2,02,76,533 కోట్లకు పడిపోయింది.

కరోనా రెండో దశ ఉద్ధృతికి దేశీయ స్టాక్‌ ‌మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఏకంగా 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది.  దీంతో కేవలం 15 నిమిష్లాలో దాదాపు 6.86 లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ ‌క్యాపిటలైజేషన్‌ 6,86,708.74 ‌కోట్ల రూపాయల నుంచి 2,02,76,533 కోట్లకు పడిపోయింది. కరోనా ఉద్ధృతి మరింత పెరిగితే బ్యాంకింగ్‌ ‌రంగానికి గడ్డు కాలమే అని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ రంగ షేర్లు భారీగా పతనమవు తున్నాయి. అత్యధికంగా ఇండస్‌ఇం‌డ్‌ ‌బ్యాంక్‌ 7‌శాతానికి పైగా నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. మిగిలిన బ్యాంకులు కూడా అదే బాట పడుతున్నాయి. మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ‌విధించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడ్డారు.

Leave a Reply