Take a fresh look at your lifestyle.

దేశంలో పెరుగుతున్న కొరోనా రికవరీ..

62.09 శాతానికి చేరుకుందన్న ఆరోగ్యశాఖ

  దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌రికవరీ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఆరోగ్యమంత్రిత్వశాఖ ఓఎస్‌డీ రాజేశ్‌ ‌భూషణ్‌ ‌విలేకరుల సమావేశం లో మాట్లాడారు. యాక్టివ్‌ ‌కేసులు,రికవరీ కేసుల మధ్య ఉన్న అంతరం క్రమంగా పెరుగుతున్నదని అన్నారు. నేడు 4,76,378 రికవరీ కేసుల్లో ప్రస్తుతం 2,69,789 యాక్టిక్‌ ‌కేసులు ఉన్నాయని చెప్పారు. రికవరీ రేటు నిరంతరం పెరుగుతూ  62.09 శాతానికి చేరుకుందని వివరించారు. దేశంలో కొవిడ్‌-19 ‌రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని చెప్పారు.
60 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న వారు దేశంలో ఎనిమిది శాతమే ఉన్నారన్నారు.  అయినప్పటికీ 39 శాతం కొవిడ్‌-19 ‌మరణాలను చూపిస్తున్నారని, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు భారతదేశ జనాభాలో 2 శాతం ఉన్నారని, కాని వారు 14 శాతం కరోనా పాజిటివ్‌ ‌మరణాలను చూపిస్తున్నారని భూషణ్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply