Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా మరణాల్లో తగ్గుదల

  • రెండున్నర నెలల తర్వాత తొలిసారి వెయ్యిలోపు నమోదు
  • 24 గంటల్లో కొత్తగా 46,148 మందికి పాజిటివ్‌

దేశంలో కొరోనా వ్యాప్తి మ్రంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా 24 గంటల్లో 46,148 మందికి వైరస్‌ ‌సోకినట్లు తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.7 శాతం తగ్గుదల కనిపించింది. ఆదివారం మరో 979 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు రెండున్నర నెలల తర్వాత తొలిసారి వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 3,02,79,331 చేరగా..3,96,730 మంది ప్రాణాలు కోల్పోయారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

అలాగే 24 గంటల్లో 15,70,515 మందికి కోవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. క్రియాశీల కేసులు 5,72,994కు చేరాయి. క్రియాశీల రేటు 1.89 శాతానికి పడిపోగా..రికవరీ రేటు 96.80 శాతానికి పెరిగింది. కాగా 58,578 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.93 కోట్లు మార్కును దాటాయి. మరోపక్క ఒక్క రోజుతో 17,21,268 మంది టీకాలు వేయించుకున్నారు. గతం వారం నుంచి చూస్తే..నిన్న టీకా పంపిణీలో భారీ తగ్గుదల కనిపించింది. ఇప్పటివరకు 32,36,63,297 మందికి టీకాలు అందాయి.

Leave a Reply