Take a fresh look at your lifestyle.

కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డికి కొరోనా

హైదరాబాద్‌, ‌జనవరి 20 : కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యులు కిషన్‌ ‌రెడ్డికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ‌వేదికగా పంచుకున్నారు. బుధవారం నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని రకాల ప్రోటోకాల్స్‌ని ఫాలో అవుతున్నాను. ప్రస్తుతం హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉన్నాను.

ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా ఉన్న వారంతా ఐసోలేషన్‌లోకి వెళ్లి కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోండి అంటూ రాసుకొచ్చారు. ఇక కిషన్‌ ‌రెడ్డి చేసిన ఈ ట్వీట్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌స్పందించారు. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అన్న అంటూ కామెంట్‌ ‌చేశారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ కూడా కిషన్‌ ‌రెడ్డి త్వరగా కరోనా నుంచి పూర్తిగా కోలుకావాలని కోరుతూ పోస్ట్ ‌చేశారు.

Leave a Reply