12 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట మనుషులు, ఒక విద్యార్థికి పాజిటివ్
మంచిర్యాల/మందమర్రి, మార్చి 15, (ప్రజాతంత్ర విలేకరి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం మంచిర్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన నిర్థారణ పరీక్షల్లో ఉపాధ్యాయులతో పాటు వంట చేసే వారికి, ఒక విద్యార్థికి కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు కొరోనా బారిన పడడంతో, మందు జాగ్రత్తగా సోమవారం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు పరీక్షలు చేశారు.
పాఠశాలలో మొత్తం 50 మంది పరీక్షలు నిర్వహించగా, 12 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు వంట మనుషులు, ఒక విద్యార్థికి కొరోనా పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు కొరోనా భారిన పడిన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైద్యశాఖ, మున్సిపల్ అధికారులకు తెలిపి పాఠశాలలో శానిటేషన్ చేయాలని కోరినట్లు ఆమె వెల్లడించారు.