Take a fresh look at your lifestyle.

ఇం‌ద్రేశం స్కూల్‌లో 25 మంది విద్యార్థినిలకు కొరోనా ఆందోళనలో తల్లిదండ్రులు

పటాన్‌చెరులోని ముత్తంగిలో విద్యార్థులకు సోకిన కొరోనాతోనే ఓ వైపు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు గజగజ వణికిపోతుంటే…తాజాగా గురువారం ఇంద్రేశంలోని గురుకులం పాఠశాలలో చదువుకుంటున్న 25 మంది విద్యార్థులకు కొరోనా సోకింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని టర్బో ఇంజినీరింగ్‌ ‌కాలేజీలో నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్‌ ‌బాలికల గురుకుల పాఠశాలలో(రామచంద్రాపురం బ్రాంచ్‌) ‌కొరోనా కలకలం రేగింది. బుధవారం ఇద్దరు విద్యార్థినులకు కొరోనా పాజిటివ్‌ ‌తేలింది.

దీనితో గురువారం మిగతా విద్యార్థినీలకు వైద్య సిబ్బంది కోవిడ్‌ ‌పరీక్షలు నిర్వహించగా 25 మంది విద్యార్థినిలకు క్విడ్‌ ‌కొరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా విద్యార్థినిలను క్వారంటైన్‌కు తరలించారు. ఇప్పటికే మండల పరిధిలోని ముత్తంగితో పాటు ఇంద్రేశం గురుకులంలో విద్యార్థినులకు కొరోనా వైరస్‌ ‌సోకడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యా, వైద్య ఆరోగ్యశాఖ, గురుకులం సిబ్బంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే, కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ‌తరుముకొస్తున్నట్లే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply