Take a fresh look at your lifestyle.

బెల్లంపల్లి పాలిటెక్నిక్‌లో కొరోనా కలకలం

12మంది సిబ్బంది, 8 మంది విద్యార్థులకు వైరస్‌ ‌పాజిటివ్‌
‌బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ‌కళాశాలలో కొరోనా కలకలం రేగింది. మంగళవారం కళాశాలలోని విద్యార్థులు, సిబ్బంది కలిపి మొత్తం 146 మందికి కొవిడ్‌ ‌పరీక్షలు నిర్వహించగా వారిలో 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్‌ ‌సోకిన వారిలో 12మంది సిబ్బంది, 8 మంది విద్యార్థులు ఉన్నారు.

దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కొరోనా సోకిన వారిని హోం ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు స్థానిక వైద్యాధికారి తెలిపారు. కొరోనా నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు.

Leave a Reply